డబుల్ ఇస్మార్ట్ టీజర్ లో ఏం రివిల్ చేయబోతున్నారు అంటే..?
TeluguStop.com
ఎనర్జిటిక్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్( Double ISmart ) సినిమా మీద ప్రస్తుతం ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఈరోజు రిలీజ్ చేశారు.
రామ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
అయితే టీజర్ లో రామ్ క్యారెక్టరైజేశన్ ను రివిల్ చేసి ఈ సినిమా మీద అంచనాలు పెంచడానికి పూరి జగన్నాథ్( Puri Jagannadh ) ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
ఇక ఈ సినిమాలో సంజయ్ దత్( Sanjay Dutt) కూడా కీలకపాత్రలో నటించబోతున్నాడు కాబట్టి ఆయన క్యారెక్టర్ ను కూడా రివిల్ చేసి సినిమాకి ఎక్కడలేని హైప్ తీసుకొచ్చి ప్రేక్షకుడి చేత విజిల్స్ కొట్టించి సినిమాను సక్సెస్ తీరాలకు చేర్చాలని పూరి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతం పూరి ఈ సినిమా బిజీలోనే ఉన్నాడు.అయితే ఈ సినిమాను ఎలాగైనా సక్సెస్ తీరాలకి చేర్చడమే లక్ష్యంగా పెట్టుకోని ముందుకు సాగుతున్నారు.
ఇక టీజర్ లో ఇంతకుముందు చూసినట్టుగా కాకుండా సరికొత్తగా ఉండేలా ప్లానింగ్ కూడా చేస్తున్నాడట.
"""/" /
మరి హీరోయిన్ క్యారెక్టర్ ను కూడా ఈ టీజర్ లో రివిల్ చేస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
ఇక మరో మూడు రోజుల్లో రామ్ బర్త్ డే సందర్భంగా ఈ టీజర్ ని భారీ ఎత్తున రిలీజ్ చేసి పాన్ ఇండియాలో రామ్ క్రేజ్ ను రెట్టింపు చేయాలనే ప్రయత్నంలో పూరి జగన్నాధ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది.
ఇక ఇప్పటికే రామ్ కైతే వరుసగా రెండు ప్లాప్ లు వచ్చాయి.కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ ని కొట్టి మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.
ఇక పూరి పరిస్థితి కూడా అలానే ఉంది.
వావ్.. ఇది కదా అసలైన రోహిత్ శర్మ.. హృదయాలను గెలుచుకున్నాడుగా