DASA స్కీమ్ అంటే ఏమిటీ? .. ప్రవాస భారతీయ విద్యార్ధులకు ఎలా ఉపయోగమంటే?
TeluguStop.com
మన దేశానికి చెందిన యువత ఉన్నత విద్య కోసం విదేశాలకు ఎలా వెళ్తున్నారో పలువురు విదేశీయులు కూడా చదువుకోవడానికి భారతదేశానికి(India) వస్తున్నారు.
మనదేశంలోని ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు( IITs, IIMs, NITs) తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశాల కోసం ప్రతియేటా వేలాది మంది విదేశీయులు, ఎన్ఆర్ఐ(Foreigners, NRI) విద్యార్ధులు పోటెత్తుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇలాంటి వారి కోసం కేంద్ర విద్యాశాఖ ఓ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
అదే DASA Scheme.2001లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ పథకం ద్వారా భారత సంతతి విద్యార్ధులు, ప్రవాస భారతీయులు, ఓసీఐ(OCI) కార్డ్ దారుల పిల్లలు, విదేశీయులు మనదేశంలోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐటీ), స్కూల్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్‌పీఏ) తదితర కేంద్ర నిధులతో పనిచేసే సాంకేతిక సంస్థలలో ప్రవేశించడానికి వీలు కల్పించింది.
"""/" /
విదేశీ విద్యార్ధులు ఈ పథకం ద్వారా అడ్మిషన్ పొందాలంటే డీఏఎస్ఏ పోర్టల్ ద్వారా ముందుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.
దరఖాస్తును పూర్తి చేసి దాసా వెబ్‌సైట్‌లో పేర్కొన్న గడువు లోగా రుసుమును చెల్లించాలి.
అలాగే అడ్మిషన్ కోసం అభ్యర్ధులు తప్పనిసరిగా దరఖాస్తు పత్రాలను ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేయాలి.
అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సుల కోసం అభ్యర్ధులు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీలచే గుర్తించబడిన 10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
"""/" /
పీజీ కోర్సుల కోసం దరఖాస్తుదారులు ఇంజనీరింగ్, టెక్నాలజీలలో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసి ఉండాలి.
పీజీ కోర్సుల కోసం జీఆర్ఈ, జీమ్యాట్ వంటి స్కోర్‌లను పరిగణనలోనికి తీసుకుంటారు.2024లో ఎన్ఐటీ రాయపూర్ దాసా పథకాన్ని పర్యవేక్షించింది.
ప్రతి యేటా జూన్‌లో రిజిస్ట్రేషన్, ఆగస్టులో అడ్మిషన్ ప్రక్రియ ముగుస్తుంది.మరింత సమాచారం కోసం, అభ్యర్థులు Dasanit!--org వెబ్‌సైట్‌ను సందర్శించమని విద్యాశాఖ తెలిపింది.
ఆ కారణంతోనే నేను థియేటర్లకు వెళ్లి సినిమా చూడను… పవన్ కామెంట్స్ వైరల్!