గతంలో ఏపీ రాజధానిగా అమరావతి ఏర్పాటు చేస్తూ దాని ప్రాధికార సంస్థగా సీఆర్డీఏను ఏర్పాటు చేసిన విషయం విధితమే.
వైసీపీ అధికారంలోకి రావడం జగన్ సీఎం అయిన తరువాత సీఆర్డీఏను రద్దు చేశారు.
మూడు రాజధానులంటూ జపం చేసిన జగన్‌కు గురువారం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో షాక్ ఇచ్చినట్టు అయింది.
ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ రాజధానికి సంబంధించిన కేసులపై కీలక తీర్పు వెలువరించింది.
అదేంటంటే మూడు రాజధానులు కుదరదని, ఏపీ రాజధాని అమరావతేనని చెప్పుకొచ్చింది.అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు అప్పట్లో ఇచ్చిన హామీలు సైతం నెరవేర్చాలంటూ తీర్పునిచ్చింది.
అలాగే సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదని, దానిని మార్చొద్దని ఏపీ హైకోర్టు తీర్పు సారంశం.
ఈక్రమంలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ ఏమి చేయనున్నారు ? అనేది చర్చగా మారింది.
అయితే అమరావతిని రాజధానిగా చేయడం జగన్‌కు ససేమిచరా ఇష్టం లేదు.అలాంటిది హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆరునెలల్లోపు భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులను కూడా తప్పు బట్టింది.గతంలో తీసుకొచ్చిన సీఆర్డీఏనే ఫైనల్ అని తేల్చి చెప్పింది.
మొత్తంగా రాజధానిని మార్చడం కుదరక పోగా ఏమాత్రం ఇష్టం కాలేని అమరావతిని రాజధాని అంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం జగన్‌కు ఇబ్బందిగా మారిందనే టాక్ వినిపిస్తోంది.