కాంగ్రెస్ ఎన్నికల హామీలే టార్గెట్ గా బీఆర్ఎస్ ఏం చేయబోతోందంటే ..?

మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై ప్రధానంగా దృష్టిసారించింది బీఆర్ఎస్ పార్టీ( BRS Party )తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఎదురైనా ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే ఆ పార్టీ కోలుకుంటోంది.

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే విధంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని అనేక అనేక విమర్శలు చేస్తున్నారు.

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana Assembly Election ) ఎదురైన ఓటమి నుంచి తీరుకుని వచ్చే లోక సభ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని పట్టుదలతో బీఆర్ఎస్ అనేక వ్యూహాలను రచిస్తోంది.

ప్రస్తుతం ఆ పార్టీ అధినేత కేసీఆర్ అనారోగ్యంతో విశ్రాంతిలోనే ఉండడంతో మొత్తం పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్ చూసుకుంటున్నారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకుని సత్తా చాటుకోవాలనే పట్టుదలతో కేటీఆర్ ఉన్నారు.

దీనిలో భాగంగానే ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు.

అలాగే జిల్లాలు, నియోజకవర్గాల వారిగా కీలక నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ, వచ్చే లోక సభ ఎన్నికలకు వారిని సిద్ధం చేస్తున్నారు.

"""/" / ముఖ్యంగా కాంగ్రెస్ ను ఎదుర్కొనే విధంగా ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు( Six Guarantee Schemes ) అమలుపైన దృష్టి సారించారు.

ఆ పథకాలు అమలు చేయాలంటే తెలంగాణ బడ్జెట్ ఏ మాత్రం సరిపోదని బీఆర్ఎస్ అంచనాకు వచ్చింది.

ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం అంటే అంత ఆషామాషీ కాదని, కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేయడం సాధ్యం కాని పని అని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటే అమలు చేస్తున్నారని , మిగిలిన గ్యారంటీలు అమలు చేయడం సాధ్యం కాదని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.

"""/" / ఈ హామీలను అమలు చేయకపోతే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది.

అందుకే కాంగ్రెస్ ఎలాంటి హామీలను నెరవేర్చలేదని, ఆ పార్టీకి ఓటు వేసినా ఉపయోగం ఉండదని బీఆర్ఎస్ జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.

ఇదే విషయాన్ని కేటీఆర్ కూడా పదేపదే చెబుతున్నారు.కాంగ్రెస్( COmgress ) ప్రకటించిన ఆరు గ్యారెంటీల పత్రాలను పట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, చేపట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించి, కాంగ్రెస్ వైపు జనాలు చూపు ఉండకుండా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పై పైచేయి సాధించే విధంగా చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.

మాయమాటలతో జనానికి కుచ్చుటోపీ.. సింగపూర్‌లో భారత సంతతి మహిళకు జైలు