‘పువ్వాడ’ కు కలిసొచ్చేదేంటి ?  ‘పొంగులేటి’ ధీమా ఏంటి ?

తెలంగాణ రాజకీయాల గురించి చెప్పుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.

ఇక్కడ పట్టు సాధించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి.రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఒకలా ఉంటే.

ఖమ్మం జిల్లా రాజకీయాలు మరోలా ఉంటాయి.ముఖ్యంగా ప్రస్తుత తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టు సాధించేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది.

కానీ ఇక్కడ కాంగ్రెస్ , వామపక్ష పార్టీల కు గట్టి పట్టు ఉండడంతో,  ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

  కేంద్ర అధికార పార్టీ బిజెపి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.

ఇక్కడి నుంచే బిజెపి జెండా ఎగురువేయాలని కంకణం కట్టుకుంది.ఇక ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం  విషయానికి వస్తే .

త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ సీటు పైన ప్రధాన పార్టీలు అన్నీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి.

ఇప్పటికే ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచిన పువ్వాడ అజయ్ కుమార్ ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు.

మూడోసారి ఇక్కడి నుంచి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో పువ్వాడ ఉండగా , బీఆర్ఎస్ లో కీలక నేతగా గుర్తింపు పొందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పై తిరుగుబావుట ఎగరవేశారు.త్వరలోనే ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే ఏ పార్టీలోకి వెళ్తారు అనేది క్లారిటీ లేకపోయినా,  ఖచ్చితంగా ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.

దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారబోతోంది.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరే అవకాశం ఉండడంతో , బిజెపి ఖమ్మం  అభ్యర్థిగా ఆయనే ఉండే ఛాన్స్ కనిపిస్తోంది .

ఇక కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో,  మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరిని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.

"""/"/ ఖమ్మం నియోజకవర్గం లో కమ్మ , కాపు , మైనార్టీ వర్గాలదే మెజార్టీ కావడంతో వారి మద్దతును  పొందేందుకు ఇప్పటి నుంచే ఎవరికి వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ ఈ నియోజకవర్గంలో తనకు తిరుగులేకుండా చేసుకునేందుకు 'వాడవాడా పువ్వాడ' పేరుతో వినూత్న కార్యక్రమం మొదలుపెట్టి , జనాలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

తనకు ప్రత్యర్థిగా ఎంతటి బలమైన నేతను ఇతర పార్టీలు పోటీకి దించినా,  సునాయాసంగా గెలిచేందుకు ఇప్పటి నుంచే పువ్వాడ కసరత్తు చేస్తున్నారు.

పువ్వాడ అజయ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఖమ్మం లో భారీగా అభివృద్ధి పనులు చోటు చేసుకోవడం, ఏళ్ల తరబడి ఉన్న ప్రధాన సమస్యలు కొన్ని చక్కబడడం, తీగెల వంతెన, కొత్త బస్టాండ్, ఐటీ హబ్, ఇలా ఎన్నో అభివృద్ధి పనులు పూర్తికావడంతో ఇవన్నీ తనకు కలిసి వస్తాయని అజయ్ ధీమా గా ఉన్నారు.

దీంతో పాటు ఇక్కడ బలంగా ఉన్న వామపక్ష పార్టీలు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో వారి బలం కూడా తనకు కలిసి వస్తుందని అజయ్ అంచనా వేస్తూ గెలుపు ధీమా తో ఉన్నారు.

"""/"/ ఇక ఖమ్మం అసెంబ్లీ పై ఆశలు పెట్టుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం చాప కింద నీరులా ఈ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆర్థికంగా బలంగా ఉండడం, ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో గట్టిపట్టు ఉండడం , భారీగా అనుచరులు, ప్రజల మద్దతు ఉండడం, పాత పరిచయాలు, ఇవన్నీ తనకు కలిసి వస్తాయని శ్రీనివాస్ రెడ్డి అంచనా వేస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పై వ్యతిరేకత జనాల్లో పెరుగుతోందని,  అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పువ్వాడ అజయ్ పనితీరు పైన ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, కచ్చితంగా ఈసారి ప్రజలు తనను గెలిపిస్తారనే అంచనాలో పొంగులేటి ఉన్నారట.

ఇలా ఈ ఇద్దరు బడా నేతలు అప్పుడే తమదే విజయం అన్న ధీమాలో ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

బీజేపీ నేతలకు విలువలు లేవు..: జగ్గారెడ్డి