ట్రంప్‌పై హత్యాయత్నం: దుండగుడు వాడిన ఆయుధంపై చర్చ , ‘‘ ఏఆర్-15 రైఫిల్ ’’ ఎందుకంత డేంజర్
TeluguStop.com
అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్( Gun Culture ) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.
ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.శక్తివంతమైన గన్ లాబీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వున్నాయి.
ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donal Trump )పై హత్యాయత్నం నేపథ్యంలో అమెరికాలో తుపాకీ సంస్కృతిపై మరోసారి చర్చ జరుగుతోంది.
ప్రాణరక్షణ , శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి ఏదో చిన్న పిస్తోలు వరకు ఓకే.
కానీ ఏకంగా సైనికులు, ప్రత్యేక సాయుధ బలగాలు ఉపయోగించే అత్యాధునిక రైఫిళ్లు, మెషిన్ గన్స్ సామాన్యుల వద్ద ఉండటం ఎంతటి ప్రమాదకరమో తాజా ఘటన మరోసారి రుజువు చేసింది.
"""/" /
ట్రంప్‌పై దాడి చేసిన దుండగుడు ఏఆర్-15 రైఫిల్( AR-15 Rifle ) వాడినట్లుగా భద్రతా సంస్థలు తెలిపాయి.
సామూహికంగా జనాల ప్రాణాలు తీయగల ఆయుధంగా దీనికి పేరుంది.ఏఆర్ 15 అంటే ‘ఆర్మా లైట్’ తుపాకీ అని అని అర్ధం.
ఇది మోడ్రన్ స్పోర్టింగ్ రైఫిల్ (ఎంఎస్ఆర్) కేటగిరీలోకి వస్తుంది.అమెరికా సైన్యం కోసం దీనిని రూపొందించారు.
పౌర అవసరాల కోసం మార్పులు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ రైఫిల్‌ను క్రీడలు, జంతువులను వేటాడటానికి వినియోగిస్తారు.
అత్యంత కచ్చితత్వంతో ఇది లక్ష్యాలను ఛేదించగలదు. """/" /
ఏఆర్ 15 గన్ ( AR-15 Rifle )నిమిషానికి 45 తూటాలను వెదజల్లగలదు.
కొన్ని ప్రత్యేక మార్పులతో నిమిషానికి 400కు పైగా తూటాలను పేల్చవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇందులో పాయింట్ 223 క్యాలిబర్ బుల్లెట్‌లను వాడతారు.ఈ బుల్లెట్ సెకనుకు కిలోమీటర్ల దూరం దూసుకెళ్తుందట.
మానవ శరీరంలోని కీలక అవయవానికి ఈ తూటా తగిలినా అక్కడికక్కడే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
బుల్లెట్ వేగం కారణంగా శరీరం ఛిద్రమవుతుందని.బాడీలోకి దూసుకొచ్చాక అవతలి వైపుకు దూసుకెళ్లే సామర్ధ్యం ఉంది.
అందుకే జనాన్ని పెద్ద సంఖ్యలో బలి తీసుకుని నరమేధం సృష్టించాలనుకునేవారు ఎక్కువగా ఏఆర్ 15 ఆయుధాన్నే వినియోగిస్తుంటారు.
అమెరికా( America )లో గన్ కల్చర్‌ను కట్టడి చేయాలనుకునే ఉద్యమాలకు ఈ రైఫిలే ప్రధాన కారణమనే వాదనలు ఉన్నాయి.
ఇప్పుడు ఏకంగా ట్రంప్‌పై దాడి నేపథ్యంలో మరోసారి తుపాకులను నియంత్రించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి.
ఎప్పుడూ గన్ లాబీకి మద్ధతు పలికే ట్రంప్.ఇప్పుడు తానే బాధితుడిగా మారడంతో ఆయన తన పాలసీలలో ఎలాంటి మార్పులు చేస్తారోనని అమెరికన్ సమాజం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
ఆ నలుగురు నాశనం అయ్యాకే నేను చనిపోతా… చలాకి చంటి షాకింగ్ కామెంట్స్!