రాజకీయాల్లో ఆనం కు దిక్కేది..?
TeluguStop.com
ఏపీ రాజకీయాలు మెల్లిగా హెతెక్కుతున్నాయి.రాజకీయ పార్టీ లు అన్ని ఒకదాని తర్వాత ఒకటి రణ క్షేత్రం లోకి దుకేస్తున్నాయి.
అయితే ఇలాంటి రాజకీయ రణనంగం లో నెల్లూరు పెద్దా రెడ్లది మాత్రం సపరేట్ రూట్ ఉంటుంది.
తెలుగు నాట రాజకీయాల్లో నెల్లూరు రెడ్ల రాజకీయం నేటికీ చిక్కు ప్రశ్నే.అలాంటి కోవకే చెందిన వ్యక్తి.
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి.తెలుగు దేశం పార్టీ నుంచి.
వైఎస్సార్సీపీ పార్టీలో చేరిన అయన.తన పార్టీ గెలిచాక మంత్రి పదవి ఆశించాడు.
అయితే సమీకరణాల దృష్ట్యా ఆయనకు పదవి దక్కలేదు.మొదటి విడతలో అనిల్ కుమార్ యాదవ్ కు దక్కడం.
ఇక రెండో టర్మ్ అయినా వస్తుంది అనుకుంటే దాన్ని కాకాని గోవర్ధన్ రెడ్డి తన్నుకు పోవడం తో అయన అసంతృప్తి లో మునిగి పోయారు.
"""/"/
అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం పై అలకబునారు.అయితే ఇదంతా కొంతకాలం తర్వాత సెట్ అవుతుందని భావించింది అధిష్టానం .
బట్ ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం అధిష్టానం కి చెక్ పెట్టడానికి ట్రై చేసారు.
ఇక విషయం తెలుసుకున్న పార్టీ ఆయన్ను ప్రతి విషయం లోనూ పక్కన పెడుతూ వచ్చింది.
ప్రభుత్వ పథకాలను సైతం దిక్కరిస్తు పార్టీ లోనే దాటి పోవడం తో మొదటి వేటు పడింది.
నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు ఏకంగా నేదురుమల్లి కి దక్కాయి.అయినా చల్లబడిన ఆనం.
మాటల వేడిని పెంచారు.దాంతో అధిష్టానం నేదురుమల్లి టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు వచ్చాయీ.
అయితే అప్పటికే టీడీపీ నుంచి వైసీపీ లోకి వచ్చిన ఆనం అటు టీడీపీ కి పోలేక ఇటు వైసీపీ లో ఉండలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
"""/"/
రాష్ట్రం లో రెండు ప్రాంతీయ పార్టీ లు ఉన్నాయని.మూడో ప్రత్యామ్నాయం ఉన్నప్పుడే.
ప్రజాస్వామ్యం నిలబడుతుంది అని అయన ప్రెస్ మీట్ లో చెప్పారు.దీన్ని బట్టి చూస్తే ఆయనకు అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు హ్యాండ్ ఇచ్చినట్టే కనిపిస్తోంది.
ఒకవేళ అదే జరిగితే అయన ఇండిపెండెంట్ గా బరిలో దిగాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఆంధ్రా లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో భు స్తాపితం ఐపోయింది.మిగిలిన బీజేపీ అస్సలు ఒక్క డిజిట్ ఓటు పర్సంటేజ్ ను దాటడం లేదు.
జన సేన పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది.దాంతో ఇప్పుడు ఆనం పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి ఐపోయింది.
ఇప్పుడు అయన వైసీపీ అధిష్టానాన్ని కూల్ చేసి కంటిన్యూ అవుతారా.? లేక బాబునే ఒప్పించి అటు దుకుతరా చూడాలి.
బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…. పుష్ప2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!