బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అంటే ఏమిటో తెలుసా.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్( Boxing Day Test ) అనే పేరు చాలామంది వినే ఉంటారు కానీ టెస్ట్ మ్యాచ్ ను బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అని ఎందుకు అంటారో బహుశా చాలామందికి తెలియకపోయి ఉండవచ్చు.

డిసెంబర్ 26న దక్షిణాఫ్రికా( South Africa ) లోని సెంచూరియన్ వేదికగా భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ను బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్.

అంటే డిసెంబర్ 26న ప్రారంభం అయ్యే టెస్ట్ మ్యాచ్ ను బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ గా పిలుస్తారు.

"""/" / ఈ తొలి బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాలో 1950-51 యాషెస్ సిరీస్ సందర్భంగా జరిగింది.

ఆ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 22న ప్రారంభం కాగా.డిసెంబర్ 25వ తేదీ సెలవు దినం.

కాబట్టి అప్పటినుంచి డిసెంబర్ 26న జరిగే టెస్ట్ మ్యాచ్ ను బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ గా పరిగణించడం మొదలైంది.

గత 43 ఏళ్లలో అత్యధిక బాక్సింగ్ డే టెస్టులు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగాయి.

"""/" / బాక్సింగ్ డే అనే పదం క్రిస్మస్ కు సంబంధించినది.డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒకరికొకరు ఇచ్చుకున్న బహుమతులను డిసెంబర్ 26న తేరుస్తారు.

కాబట్టి డిసెంబర్ 26న ఏ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయిన ఆ మ్యాచ్ ను బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అని పిలవడం జరుగుతోంది.

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్ డిసెంబర్ 26వ తేదీ దక్షిణాఫ్రికా తో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.

సౌత్ ఆఫ్రికా గడ్డపై భారత్ ఇప్పటివరకు టెస్ట్ సిరీస్ గెలవలేదు.ఈ సిరీస్ లో గెలిచి ఓ సరికొత్త చరిత్ర సృష్టించాలని భారత జట్టు భావిస్తోంది.

అల్లు అర్జున్ అరెస్టు… వైరల్ అవుతున్న వేణు స్వామి వీడియో!