చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణ వ్రతమాచరిస్తే?

తెలుగు కొత్త సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి పౌర్ణమి చైత్ర పూర్ణిమ.ఈ పౌర్ణమి ఏప్రిల్ 26 సోమవారం వస్తుంది.

ప్రతి నెలా వచ్చే ఈ పౌర్ణమి, అమావాస్య రోజు లు ఎంతో ప్రత్యేకం.

ఈ ప్రత్యేకమైన రోజులలో కొన్ని పనులు చేయడం, కొన్ని దేవతలకు పూజ చేయడం వంటి వాటి ద్వారా సకల సంపదలను పొందవచ్చునని పండితులు చెబుతుంటారు.

మరి కొత్త ఏడాది వచ్చే మొదటి పౌర్ణమి అయినా చైత్ర పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే సకల సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

ఈ చైత్ర పౌర్ణమి రోజు చంద్రుడు పూర్ణ బిందువుగా ప్రకాశిస్తూ భూమికి అతి దగ్గరగా ఉంటాడు.

ఈ పౌర్ణమి రోజున శివకేశవులను ఆరాధించడం వల్ల సమస్త దోషాలు తొలగి పోవడమే కాకుండా సూర్యచంద్ర దోషాలు కూడా తొలగిపోతాయి.

ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల ఆ ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.

సత్యనారాయణ వ్రతం ఆచరించి స్వామివారికి నైవేద్యంగా అటుకుల పాయసం, కేసరి సమర్పించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

చైత్ర పౌర్ణమి రోజు ఉదయం స్నానమాచరించి ఇంటి ముందు రంగవల్లులు వేసి, మన ఇష్టదైవాన్ని ఉపవాసం తో పూజ చేయాలి.

అదే విధంగా ఈ చైత్ర పౌర్ణమి రోజు చిత్రగుప్తుడి ఆలయాన్ని సందర్శించడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.

అదేవిధంగా శివకేశవులను అష్టోత్తరాలతో స్తుతించడం మంచిది.అలాగే చైత్ర పౌర్ణమి రోజు పేదలకు అన్నదానం చేయడం ద్వారా సర్వ శుభాలను ఇస్తూ, ముక్తిని ప్రసాదిస్తుంది.

"""/"/ చైత్ర పౌర్ణమి రోజు సరైన ముహూర్తాలు: అభిజిత్ ముహూర్తాలు-ఉదయం.11:48- రాత్రి 12:39 గంటల వరకు అమృతకాలము - సాయంత్రం 05:27 గంటల నుంచి 06:52 వరకు బ్రహ్మ ముహూర్తం - 04:20 గంటల నుంచి - 05:08 వరకు ఈ సమయాలు పూజ చేయుటకు ఎంతో అనువైనవి.

గిద్దలూరు సభలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!