అక్కడా ఉంటాం.. ఇక్కడా ఉంటాం ! కేసీఆర్, జగన్ రాజకీయాలు కలిస్తే ?
TeluguStop.com
అక్కడా ఉంటా.ఇక్కడా ఉంటా .
ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తోందా ? అవును.ఇది రాణి రుద్రమదేవి సినిమాలోని డైలాగ్.
అలా రెండు ప్రాంతాలపై ఉన్న మక్కువను తెలిపేలా దర్శకుడు డైలాగ్ రాశాడని అనుకోవచ్చు.
అచ్చు ఇలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోందా ? అంటే అవుననక తప్పదు.
ఎందుకంటే జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్ వామపక్ష పార్టీల నాయకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
గతంలో ఏపీ గురించి మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆంధ్రాకు వస్తే బాటుంటుంది అని అనుకుంటున్నారట.
అలాగే అమరావతికి నిధులు ఇవ్వాలని కోరుతున్నారట.దీనికి కారణం లేకపోలేదు.
గతంలో అమరావతి రాజధాని శంకుస్థాపన రోజే నిధులు ఇవ్వాలని కేసీఆర్ అనుకున్నా సాధ్యం కాలేదని నాడు మంత్రి కేటీఆర్ కూడా స్పష్టం చేశారు.
దీనికి ప్రధాని మోడీనే కారణమంటూ చెప్పుకొచ్చారు.దేశ తరపున మోడీ నిధులు ఇవ్వకుండా తాము నిధులు ఇస్తే బాగోదని ఇవ్వలేక పోయామంటూ చెప్పారు కూడా.
లేదంటే ఆంధ్రుల రాజధాని అమరావతి అభివృద్దికి వందకోట్లు ఇవ్వడం పెద్ద విషయం కాదంటూ చెప్పుకొచ్చిన విషయం విధితమే.
కేటీఆర్ విషయం ఎలా ఉన్నా .కేసీఆర్ అంటే మాత్రం ఏపీలో క్రేజ్ మాత్రం ఉంది.
"""/" /
తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు సోషల్ మీడియాలో కవితక్క పోస్టులకు ఆంధ్ర ప్రజలు మద్దతుగా నిలిచారు.
అయితే ఒకానొక సందర్భంలో కవితక్క పార్లమెంట్‌లో జై ఆంధ్ర నినాదం వినిపించిన విషయం విధితమే.
విభజన చట్ట ప్రకారం ఏపీకి న్యాయం చేయాల్సిందేనని పట్టు బట్టారు కూడా.ఇక హరీశ్‌రావు కూడా రెండు తెలుగు రష్ట్రాలు కూర్చుని మాట్లాడు కుంటే పరిష్రారం అయ్యే సమస్యలకు కేంద్రం వద్ద పంచాయతీ ఎందుకంటూ చెప్పిన విషయం అందరికి తెలిసిందే.
ఇలా ఏ లెక్కన చూసుకున్నా జాతీయ స్థాయిలో కేసీఆర్ పార్టీ వస్తే ఏపీ మద్దతు లభించడం ఖాయమనిస్తోంది.
"""/" /
మరోవైపు తెలంగాణలో చౌదరి ప్రాబల్యం కన్నా రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉంది.
ఈ క్రమంలో తెలంగాణకు ఏపీ సీఎం జగన్ వెళ్లడం ఖాయమనిస్తోంది ఎందుకంటే గతంలో కేసీఆర్‌కు సాయం చేసిన ఘటనలున్నాయి.
మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ కూడా జగన్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.గతంలో ఇలా ఇద్దరూ సమన్వయంతో ముందుకు సాగిన దాఖలాలు ఉన్నాయి.
అందుకే కేసీఆర్, జగన్ ఇద్దరి రాజకీయాలు కలిస్తే వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలకు శుభ పరిణామాలే అనే టాక్ చక్కర్లు కొడుతోంది.
మరి ఏపీలో కేసీఆర్, తెలంగాణలో జగన్ మద్దతు ఎలా ఉంటుందో వేచి చూడాలి.
ఆ స్టార్ డైరెక్టర్ డైలాగ్స్ అంటే ప్రభాస్ కు చాలా ఇష్టమట.. ఫ్లాపులిచ్చినా మారలేదుగా!