రాత్రుళ్లు భోజ‌నం మానేస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

వెయిట్ లాస్ అవ్వ‌డం కోసం రాత్రుళ్లు కొంద‌రు చాలా అంటే చాలా మితంగా భోజ‌నం తీసుకుంటారు.

కానీ, కొంద‌రు మాత్రం బ‌రువు త‌గ్గాల‌నే అతి ఉత్సాహంతో భోజ‌నం తిన‌డం పూర్తిగా మానేస్తుంటారు.

ఇలా అస్స‌లు చేయ‌కూడ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.రాత్రుళ్లు ఫుడ్ తీసుకోవ‌డం మానేస్తే.

బ‌రువు త‌గ్గ‌డం కాదు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తడం ఖాయ‌మ‌ని అంటున్నారు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం రాత్రుళ్లు భోజ‌నం మానేయ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతోంది.

? అస‌లు దీని వ‌ల్ల ఏయే స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.

రాత్రుళ్లు భోజ‌నం మానేయ‌డం వ‌ల్ల నిద్ర ప‌ట్ట‌దు.ఇలానే ప్ర‌తి రోజు జ‌రిగితే.

చివ‌ర‌కు నిద్రలేమికి దారి తీస్తుంది.ఈ నిద్ర‌లేమి కార‌ణంగా ఒత్తిడి, ఆందోళ‌న‌, గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ పెర‌గ‌డం, రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ దెబ్బ తిన‌డం వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

అందుకే నైట్‌ ఫుడ్‌ను అస్స‌లు స్కిప్ చేయ‌కూడ‌ద‌ని అంటున్నారు.అలాగే రాత్రుళ్లు ఖాళీ కడుపుతో ప‌డుకుంటే ఉద‌యానికి నీర‌సంగా మారిపోతారు.

అల‌స‌ట‌, చికాకు, త‌ల నొప్పి, క‌ళ్లు తిర‌గ‌డం వంటి స‌మ‌స్య‌లు సైతం వేధిస్తాయి.

అంతే కాదండోయ్‌, రాత్రుళ్లు భోజ‌నం మానేయ‌డం వ‌ల్ల గ్యాస్‌, ఎసిడిటీ వంటి జీర్ణ స‌మ‌స్య‌ల‌తో పాటు పోష‌కాల కొర‌త‌ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

"""/" / కాబ‌ట్టి, నైట్ టైమ్ ఏమీ తిన‌కుండా అస్స‌లు నిద్రించ‌రాదు.ఎంతో కొంత తిన్నాక బెడ్ ఎక్కాలి.

అయితే బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న వారు మాత్రం రాత్రుళ్లు వైట్ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్‌, స‌లాడ్స్‌, జొన్న రొట్టెలు, చ‌పాతీలు, ఓట్స్ ఆమ్లెట్‌, స్మూతీస్‌, మొలకెత్తిన గింజలు, పండ్లు, కూరగాయ ముక్కలు, సెనగలు వంటి వాటిని తీసుకుంటే మంచిద‌ని, ఇవి క‌డుపు నింప‌డ‌మే కాకుండా బ‌రువునూ త‌గ్గిస్తాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!