యాపిల్‌ నైట్ టైమ్ తింటే ఆ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు!!

యాపిల్‌.ధ‌ర‌తో పాటు పోష‌కాలు కూడా ఎక్కువే.

రోజుకు ఒక యాపిల్‌ తింటే ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.

ఇక రుచి కూడా అద్భుతంగా ఉండ‌డంతో.చిన్న పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు యాపిల్ తినేందుకు ఎంతో ఇష్టం చూపిస్తారు.

యాపిల్‌లో అధిక మొత్తంలో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి.ఇవి మ‌న శరీరంలోని రక్తాన్ని మరింత పటిష్ఠం చేస్తాయి.

రక్తహీనతతో బాద‌ప‌డేవారికి యాపిల్ బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు.ఎందుకంటే.

యాపిల్ ఇనుము, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి.ఇవి ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను నివారిస్తుంది.

అలాగే యాపిల్‌లో పొటాషియం, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి.సోడియం తక్కువగా ఉంటుంది కాబట్టి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

"""/"/ మ‌రియు గుండె జ‌బ్బుల‌ను సైతం నివారిస్తుంది.అలాగే యాపిల్‌లో పెక్టిన్ అనే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది.

ఇది రక్తంలో చక్కెర స్థాయులను, కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది.ఇక రోజుకు ఒక యాపిల్ తిన‌డం వ‌ల్ల మ‌రో అద్భుత ప్ర‌యోజ‌నం ఏంటంటే.

రోగ‌నిరోధ‌క శ‌క్తిని కూడా పెంపొందిస్తుంది.అవును, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌ సి మన రోగనిరోధకశక్తిని బ‌ల‌ప‌రుస్తాయి.

అయితే ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజనాలు ఉన్న యాపిల్ చాలా మంది నైట్ టైమ్ తీసుకుంటారు.

కానీ, అలా చేయ‌డం చాలా పొర‌పాటు.ఎందుకంటే.

యాపిల్ లో ఉండే యాసిడ్స్ కడుపులో యాసిడ్ స్థాయులను పెంచేస్తాయి.అంతేకాదు, యాపిల్‌లో ఉండే పెక్టిన్ వల్ల రాత్రి వేళలో జీర్ణవ్యవస్థపై తీవ్ర భారం పడుతుంది.

త‌ద్వారా అసిడిటీ స‌మ‌స్య‌ల‌కు దారితీస్తోంది.మ‌రియు క‌డుపు నొప్పి ఇత‌రిత‌ర స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి.

అందుకే రాత్రి వేళ‌లో యాపిల్ తిన‌క‌పోవ‌డ‌మే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పవన్ కళ్యాణ్ పేరు తలుచుకుంటే చాలు ఆక్సిజన్ లభిస్తుంది: చంద్ర బోస్