స్త్రీలు రోజూ అర‌టి పండును తీసుకుంటే ఏం అవుతుందో తెలుసా?

ఆరోగ్యానికి మేలు చేస్తే అద్భుత‌మైన పండ్ల‌లో అర‌టి పండు ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

వీటి ధ‌ర త‌క్కువే అయిన‌ప్ప‌టికీ.విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ ఎ, విట‌మిన్ కె, విటిమ‌న్ ఇ, పొటాషియం, కాల్షియం, ఐర‌న్‌, మెగ్నీషియం, జింక్‌, యాంటీ అక్సిడెంట్స్‌, ఫైబ‌ర్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు నిండి ఉంటాయి.

అందు వ‌ల్ల‌నే అర‌టి పండ్లు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్‌ను అందించ‌గ‌ల‌వు.అయితే అర‌టి పండ్ల‌లో క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని, వాటిని తింటే బ‌రువు పెరిగి పోతార‌ని చాలా మంది న‌మ్ముతారు.

అందుకే అర‌టి పండ్ల‌ను కొంద‌రు దూరం పెడుతుంటారు.కానీ, వాటిని లిమిట్ తీసుకుంటే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు.

పైగా ఎన్నో ఆరోగ్య లాభాల‌ను కూడా పొందొచ్చు.ముఖ్యంగా స్త్రీలు రోజూ ఒక అర‌టి పండును తీసుకుంటే అనేక జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చు.

సాధార‌ణంగా స్త్రీల‌లో ఎముక‌ల బ‌ల‌హీన‌త అత్య‌ధికంగా కనిస్తుంది.అయితే అర‌టి పండులో కాల్షియం పుష్క‌లంగా ఉంటుంది.

అందు వ‌ల్ల‌, రెగ్యుల‌ర్‌గా ఒక అర‌టి పండును తీసుకుంటే ఎముక‌లు దృఢంగా ఉంటాయి.

"""/"/ అలాగే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ‌గా డిప్రెష‌న్‌కు గుర‌వుతుంటాయి.కానీ, రోజూ ఒక అర‌టి పండును తీసుకుంటే.

అందులో ఉండే విట‌మిన్ బి మ‌రియు శ‌క్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మెద‌డు ప‌ని తీరును మెరుగు పరిచి డిప్రెష‌న్‌ను ద‌రి చేర‌కుండా అడ్డుక‌ట్ట వేస్తుంది.

స్త్రీ లంద‌రిలోనూ కామ‌న్‌గా క‌నిపించే స‌మ‌స్య‌ల్లో ర‌క్త హీన‌త ఒక‌టి.అయితే రోజుకొక అర‌టి పండును తీసుకుని శ‌రీరానికి ఐర‌న్ అందుతుంది.

దాంతో ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య పెరిగి ర‌క్త హీన‌త స‌మ‌స్య దూరం అవుతంది.

ఇక స్త్రీలు ప్ర‌తి రోజూ ఒక అర‌టి పండును తీసుకుంటే గుండె పోటు, ఇత‌ర గుండె సంబంధింత జ‌బ్బుల‌కు దూరంగా ఉంటారు.

మ‌రియు జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు సైతం మెరుగుప‌డుతుంది.

50 రోజుల్లో 11 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం.. పవర్ స్టార్ పవన్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!