ఉద‌యం లేవ‌గానే ఫోన్ చూస్తున్నారా.. అయితే రిస్క్‌లో ప‌డ‌టం ఖాయం!

నేటి ఆధునిక కాలంలో చిన్న‌, పెద్ద అనే తేడా లేకుండా దాదాపు అంద‌రూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు.

సోష‌ల్ మీడియా యాప్స్‌, గేమింగ్ యాప్స్ రాక‌తో స్మార్ట్ ఫోన్ వినియోగం మ‌రింత పెరిగింది.

రోజులో స‌గానికి పైగా స‌మయాన్ని ఫోన్‌లోనే గ‌డుపుతున్న వారు చాలా మంది ఉన్నారు.

ఇక నిద్రించే స‌మ‌యంలోనూ ఫోన్‌ను వ‌దిలి పెట్ట‌డం లేదు.అలాగే ఉద‌యం లేవ‌గానే కూడా ఫోన్ చూస్తూనే రోజును ప్రారంభిస్తున్నారు.

నిద్ర లేవ‌గానే ట‌క్కున ఫోన్ ప‌ట్టుకుని.ఏం ఏం మెసేజ్‌లు వ‌చ్చాయి, ఎవ‌రు కాల్ చేశారు ఇలాంటివి చెక్ చేసుకునే అల‌వాటు చాలా మంది ఉంటుంది.

కానీ, ఇక్క‌డ చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.ఉద‌యం నిద్ర‌ లేవ‌గానే ఫోన్ చూడ‌టం చాలా ప్ర‌మాదమ‌ని, అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు నిపుణులు.

ఎందుకూ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ఉద‌యం లేవ‌గానే ఫోన్ చూడ‌టం వ‌ల్ల‌.

అప్ప‌టి వ‌ర‌కు విశ్రాంతి తీసుకున్న కళ్లపై ఒక్కసారిగా ఎక్కువ కాంతి పడుతుంది.ఇలా ఒక‌టి రెండు రోజులు జ‌రిగితే.

ఎలాంటి ప్ర‌భావం ఉండ‌దు.కానీ, ప్ర‌తి రోజు ఇలానే జ‌రిగి.

కంటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ‌తిని.చూపు మంద‌గించ‌డం ప్రారంభం అవుతుంది.

"""/"/ అలాగే ఉద‌యం లేవ‌గానే ఫోన్ చూడ‌టం వ‌ల్ల ర‌క్త‌పోటు వ‌చ్చే ప్ర‌మాదం కూడా ఉంది.

అదెలా అంటే.సాధార‌ణంగా మ‌న‌కు వ‌చ్చే మెసేజ్‌లు మంచివి అవ్వొచ్చు.

మ‌రియు చెడ్డ‌వి అవ్వొచ్చు.ఒక వేళ చెడ్డ‌వి అయితే.

ఉద‌యం వాటిని చూడ‌గానే మెద‌డుపై తీవ్ర ప్ర‌భావం ప‌డ‌టంతో పాటు ర‌క్త‌పోటు పెర‌గ‌డ‌మో.

త‌గ్గిపోవ‌డ‌మో జ‌రుగుతుంది.అంతేకాదు, ఈ మెసేజ్‌ల గురించే రోజంతా ఆలోచిస్తే.

ఒత్తిడి, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం కూడా ఉంది.ఇక ఉద‌యం నిద్ర లేవ‌గానే ఫోన్ చూడ‌టం వ‌ల్ల‌.

అందులోని వెలుతురు నుండి వచ్చే కిరణాలు క‌ళ్ల‌లోకి నేరుగా ప‌డుతాయి.ఇదే అల‌వాటు అయితే.

మైగ్రేన్ స‌మ‌స్య‌కు దారి తీస్తుంది.అందువ‌ల్ల‌, ఉద‌యం లేవ‌గానే ఫోన్లు చూడ‌టం మానేసి.

సూర్యోదయాన్ని చూస్తూ.ఇష్ట‌మైన పాట‌లు వింటూ.

మొక్కలకు నీరు పోస్తూ గడిపితే రోజంతా ఫ్రెష్‌గా ఉంటుంది.

మంచు విష్ణు కన్నప్ప బిజినెస్ పరంగా ఓకే మరి సక్సెస్ పరంగా ఏం చేయబోతున్నాడు…