చల్లగా ఉందని నీళ్లు తాగడం మానేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
TeluguStop.com
మన శరీరానికి అవసరమయ్యే అతి ముఖ్యమైన వనరుల్లో నీరు ఒకటి.అయితే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలా మంది నీళ్లు తాగేందుకు పెద్దగా మక్కువ చూపరు.
వేసవి కాలంలో తాగినంత నీరు వర్షాకాలం( Rainy Season ) మరియు చలికాలంలో తాగరు.
ఈ పొరపాటు మీరు చేస్తున్నారా.? అయితే ఏరికోరి సమస్యను తెచ్చుకున్నట్లే.
వాతావరణం వేడిగా ఉన్న లేక చల్లగా ఉన్న మన శరీరానికి అవసరమయ్యే నీళ్లను ( Water )మాత్రం కచ్చితంగా అందించాల్సిందే.
"""/" /
సరిపడా నీళ్లు తాగకపోవడం వల్ల మన శరీరం కొవ్వును కరిగించే శక్తిని కోల్పోతుంది.
పైగా చల్లటి వాతావరణంలో వ్యాయామం చేయడానికి కూడా బద్దకిస్తారు.ఫలితంగా బరువు పెరుగుతారు.
అందుకే చల్లగా ఉన్నా కూడా మంచి నీరు మాత్రం మంచిగా తాగాలి.అలాగే కొందరు ఒంట్లో వేడి చేసిందని అంటుంటారు.
ఇందుకు ప్రధాన కారణం మీరు సరిగ్గా నీరు తాగకపోవడం.మంచినీళ్లు మన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేస్తుంది.
ఎప్పుడైతే మీ ఒంట్లో నీటి శాతం తగ్గుతుందో అప్పుడు వేడి పెరుగుతుంది.అలాంటి సమయంలో చాలా మంది కొబ్బరి నీళ్లు, మజ్జిగ, సబ్జా వాటర్ తాగుతుంటారు.
కానీ అవి ఏమీ అవసరం లేదు.మీరు పుష్కలంగా మంచి నీళ్ళు తీసుకుంటే బాడీ హీట్ చాలా వేగంగా నార్మల్ అవుతుంది.
"""/" /
ప్రస్తుతం వర్షాకాలంలో చర్మ సమస్యలు( Skin Problems ) అనేవి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి.
పొడి గాలులు, చర్మాన్ని డ్రైగా మార్చి కాంతిహీనంగా చూపుతాయి.అయితే చర్మం తేమగా మరియు కళగా ఉండాలంటే మంచి నీళ్లే ఉత్తమ మార్గం.
సరిపడా వాటర్ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.అందంగా మెరుస్తుంది.
ఇక చల్లగా ఉందని నీళ్లు తాగడం మానేస్తే బాడీ డీహైడ్రేట్ అవుతుంది.రోగ నిరోధక శక్తి దెబ్బతింటుంది.
ఫలితంగా సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి.కాబట్టి సీజన్ ఏదైనా సరే బాడీకి అవసరమయ్యే నీటిని అందించండి.
అక్క అంటే నీకేంటి ప్రాబ్లమ్.. యష్మీకి నాగార్జున భారీ షాకిచ్చాడుగా!