వండిన చికెన్ ను ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!!
TeluguStop.com
నేటి ఆధునిక కాలంలో ప్రతి ఇంటికి ఫ్రిడ్జ్ అనేది ఒక నిత్య అవసరంగా మారిపోయింది.
ఈ ఎలక్ట్రానిక్ పరికరం లేని ఇల్లే ఉండటం లేదు.అందరూ ఫ్రిడ్జ్ ( Fridge )ను వాడుతున్నారు.
కానీ దానిలో ఏవి పెట్టాలి.? ఏవి పెట్టకూడదు.
? అన్న అవగాహన మాత్రం నూటికి 90 శాతం మందికి కూడా లేకపోవడం గమనార్హం.
కూరగాయలు, పండ్లు, పప్పులు, ఉప్పులు, కూరలు ఇలా ఒకటేమిటి చేతికి ఏది దొరికితే అది ఫ్రిడ్జ్ లోకి తోసేస్తుంటారు.
కానీ ఫ్రిడ్జ్ లో పెట్టకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి.అవి ఏంటి.
వాటిని పెట్టడం వల్ల కలిగే నష్టాలు ఏ విధంగా ఉంటాయి.అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ చాలా మందికి మోస్ట్ ఫేవరెట్ ఐటమ్.నాన్ వెజ్ లో పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువగా తినేది చికెన్ నే.
చికెన్ తో రకరకాల ఐటమ్స్ చేస్తూ ఉంటారు.అయితే వండిన చికెన్ ను ఇంట్లో అందరూ తినేశాక కాస్తో కూస్తో మిగిలిపోతూ ఉంటుంది.
ఆ చికెన్( Chicken ) ను దాదాపు అందరూ ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే లేదా రెండు మూడు రోజుల తర్వాత తింటూ ఉంటారు.
కానీ ఇకపై ఈ పొరపాటును అస్సలు చేయకండి.నిజానికి వండిన చికెన్ ను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.
ఫ్రిజ్ లో పెట్టడం వల్ల చికెన్ రంగు రుచి మారిపోతాయి.ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
కచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితి వస్తే వండిన చికెన్ ను ఒకరోజుకు మించి ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు.
"""/" /
అలాగే ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ ను( Fruits Fridge ) పెట్టడం మనందరికీ ఉన్న కామన్ అలవాటు.
కానీ అన్ని రకాల పండ్లు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.ముఖ్యంగా అరటి పండ్లు ఫ్రిడ్జ్ లో పెడితే తొందరగా పాడైపోతాయి.
రూమ్ టెంపరేచర్ లో ఉంటే ఎక్కువ రోజులు పాటు నిల్వ ఉంటాయి.ఫ్రిడ్జ్ లో పెట్టకూడదని ఆహార పదార్థాల్లో కాఫీ పౌడర్ ఒకటి.
ఎందుకంటే ఫ్రిడ్జ్ లో తేమ కారణంగా కాఫీ పౌడర్ యొక్క ఫ్లేవర్ మరియు వాసన రెండు తగ్గిపోతాయి.
"""/" /
ఇక కూరగాయల్లో టమాటో మరియు బంగాళదుంపలను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.
టమాటోలను ఫ్రిడ్జ్ లో పెడితే వాటి టేస్ట్, ఆకృతి పూర్తిగా దెబ్బ తింటాయి.
బంగాళదుంపలను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల అందులో ఉండే పిండి పదార్థాలు విచ్ఛిన్నం అవుతాయి.
కొండపైకి ఎక్కుతూ జారిన మహిళ.. చివరకు? (వీడియో)