ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగడం వల్ల ఏం అవుతుందో తెలుసా?
TeluguStop.com
ఇటీవల రోజుల్లో చాలా మంది చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లంను( Jaggery ) ఎంచుకుంటున్నారు.
శుద్ధి చేయని సహజ రూపంలో ఉండటం వల్ల బెల్లం చక్కెర కంటే ఉత్తమమైనది.
పైగా బెల్లంలో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, జింక్, సెలీనియం వంటి అనేక పోషకాలు నిండి ఉంటాయి.
అందువల్ల పరిమితంగా తీసుకుంటే ఆరోగ్య పరంగా బెల్లం చాలా మేలు చేస్తుంది.అలాగే ఖాళీ కడుపుతో( Empty Stomach ) కొందరు బెల్లం నీరు తాగుతుంటారు.
ఇలా చేయడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.అవును, మీరు విన్నది నిజమే.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వన్ టీ స్పూన్ ఆర్గానిక్ బెల్లం పొడి కలిపి ఖాళీ కడుపుతో తీసుకోవాలి.
బెల్లంలో ఐరన్, మాగ్నీషియం వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి.ఇవి రోగ నిరోధక శక్తిని( Immunity Power ) పెంచడంతో తోడ్పడతాయి.
ప్రస్తుత చలికాలంలో ఇమ్యూనిటీ బూస్టప్ కు బెల్లం నీరు మంచి ఎంపిక అవుతుంది.
"""/" /
అలాగే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగడం వల్ల డిటాక్సిఫికేషన్ జరుగుతుంది.
బెల్లం నీళ్లు కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి మరియు శరీరంలోని విషాలను బయటకు పంపుతాయి.
బరువు తగ్గాలని( Weight Loss ) ప్రయత్నిస్తున్న వారికి కూడా బెల్లం నీరు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
ఖాళీ కడుపులో బెల్లం నీళ్లు( Jaggery Water ) తాగితే మెటబాలిజం మెరుగుపరుస్తుంది.
ఇది వెయిట్ లాస్ కు మద్దతు ఇస్తుంది. """/" /
బెల్లం జీర్ణక్రియ ఎంజైములను ఉత్పత్తికి సహాయపడుతుంది.
జీర్ణక్రియను ఉత్తేజ పరుస్తుంది.ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.అంతేకాదండోయ్.
బెల్లం నీరు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.చల్లటి వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.
హేమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలోనూ ఉపయోగపడతాయి.అయితే ఆరోగ్యానికి మంచదన్నారు కదా అని బెల్లం నీరు అధిక మొత్తంలో తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయి.
మరియు మధుమేహం ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే బెల్లం నీరు త్రాగాలి.
మలయాళం హీరోల బాటలో నడుస్తున్న తెలుగు సీనియర్ హీరోలు…