వేస‌విలో రోజూ ఉద‌యం జీల‌క‌ర్ర నీరు తాగితే ఏం అవుతుందో తెలుసా?

వేస‌విలో రోజూ ఉద‌యం జీల‌క‌ర్ర నీరు తాగితే ఏం అవుతుందో తెలుసా?

జీలకర్ర ( Cumin )అనేది మ‌న భారతీయ వంటకాల్లో ముఖ్యమైన మసాలా దినుసుగా ఉపయోగించబడుతుంది.

వేస‌విలో రోజూ ఉద‌యం జీల‌క‌ర్ర నీరు తాగితే ఏం అవుతుందో తెలుసా?

ఆయుర్వేద వైద్యంలోనూ జీల‌క‌ర్ర విశేషమైన ప్రాముఖ్యతను క‌లిగి ఉంది.ఇక‌పోతే ప్ర‌స్తుత వేస‌వి కాలంలో జీల‌క‌ర్ర ఆరోగ్యానికి కొండంత అండంగా ఉంటుంది.

వేస‌విలో రోజూ ఉద‌యం జీల‌క‌ర్ర నీరు తాగితే ఏం అవుతుందో తెలుసా?

వేస‌విలో రోజూ ఉద‌యం జీల‌క‌ర్ర నీరు తాగితే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

స‌మ్మ‌ర్ సీజ‌న్ లో అధిక వేడి కార‌ణంగా చెమ‌ట‌లు ఎక్కువ ప‌ట్టి శరీరంలో నీటి శాతం తగ్గే ప్రమాదం ఉంటుంది.

అయితే రోజూ ఉద‌యం ఒక గ్లాస్ జీలకర్ర నీరు( Cumin Water ) తాగడం వల్ల తేమ నిల్వ ఉండటంతో పాటు శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది.

వేస‌వి కాలంలో జీర్ణక్రియ మంద‌గించ‌డం వ‌ల్ల గ్యాస్‌, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఇబ్బంది పెడుతుంటాయి.

అయితే జీలకర్ర నీరు ఆయా స‌మ‌స్య‌ల‌కు చెక్ పెడుతుంది.జీలకర్రలో ఉన్న ఎంజైములు జీర్ణ వ్యవస్థను చక్కగా పనిచేయడానికి మ‌ద్ద‌తు ఇస్తాయి.

"""/" / ర‌క్త‌హీన‌త( Anemia ) ఉన్న‌వారికి జీల‌క‌ర్ర నీరు ఎంతో మేలైన‌ది.

జీల‌క‌ర్రలో ఐర‌న్ కంటెంట్ మెండుగా ఉంటుంది.అందువ‌ల్ల జీల‌క‌ర్ర నీరును నిత్యం తీసుకుంటే ర‌క్త‌హీన‌త ద‌రిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.

జీల‌క‌ర్ర నీరు డిటాక్స్ డ్రింక్ గా కూడా ఉపయోగప‌డుతుంది.ఇది కాలేయాన్ని శుభ్రపరచడంతో పాటు శరీరంలో హానికరమైన పదార్థాలను తొలగించడంలో హెల్ప్ చేస్తుంది.

అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్న‌వారికి కూడా జీల‌క‌ర్ర నీరును త‌మ రెగ్యుల‌ర్ డైట్ లో చేర్చుకోవ‌చ్చు.

మెటాబాలిజాన్ని వేగంగా మార్చి శరీరంలోని కొవ్వును కరిగించడంలో, ఊబకాయం స‌మ‌స్య‌ను దూరం చేయ‌డంలో జీల‌క‌ర్ర నీరు తోడ్ప‌డుతుంది.

"""/" / ఇక జీల‌క‌ర్ర నీరును త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం.

ఒక గ్లాస్ వాట‌ర్ లో వ‌న్ టేబుల్ స్పూన్ జీల‌క‌ర్ర వేసి నైట్ అంతా నాన‌బెట్టుకోవాలి.

మ‌రుస‌టి రోజు ఆ నీటిని గోరు వెచ్చగా చేసి సేవించాలి.కావాలనుకుంటే జీల‌క‌ర్ర నీరు తేనె లేదా నిమ్మరసం కలిపి తాగొచ్చు.

అయితే ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం మితిమీరిన డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది, కాబట్టి సమతుల్యతగా తాగాలి.

నా తల్లీదండ్రుల పెళ్లికి మతం అడ్డు రాలేదు.. సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

నా తల్లీదండ్రుల పెళ్లికి మతం అడ్డు రాలేదు.. సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!