నాన్ వెజ్ పూర్తిగా మానేస్తే ఆరోగ్యానికి మంచిదా..కాదా..?

చాలా మంది ముక్క లేనిదే ముద్ద దిగదు అని చెబుతూ ఉంటారు.తినే కంచంలో మాంసం కనిపించకపోతే తినకుండానే లేచే వాళ్ళు చాలామంది ఉన్నారు.

కానీ నాన్ వెజ్( Non Veg ) తినే వాళ్ళ కంటే కూడా పూర్తి శాకాహారులే ఆరోగ్యంగా ఉంటారని చాలామందికి తెలియదు.

స్వచ్ఛమైన శాఖాహారులు అంటే మాంసాహారాన్ని ముట్టుకొని వారు.వీళ్లు గుడ్లు( Eggs ) కూడా తినరు.

అలాగే పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటికీ కూడా చాలా దూరంగా ఉంటారు.

వీరంతా శాఖాహారుల కిందికి వస్తారు.అయితే శాఖాహారంలో చాలా రకాలు ఉంటాయి.

లాక్టో ఓవో శాకాహారులు మాంసం, చికెన్, చేపలు వంటివి తినరు.కానీ గుడ్లు, పాల ఉత్పత్తులను తీసుకుంటారు.

"""/" / వీరితో పాటుగానే మరికొంత మంది కూడా ఉంటారు.వారు మాంసాహారం( Non-vegetarian Food )లోని గ్రేవీని తింటారు.

కానీ ముక్కలను మాత్రం తినరు.కానీ తమను తాము శాకాహారులుగా చెప్పుకుంటూ ఉంటారు.

నిజానికి వీరంతా స్వచ్ఛమైన శాఖాహారులు కాదు.మాంసం, చేపలు( Fish ), గుడ్లు, పాల ఉత్పత్తిలో ఇలా అన్నిటిని దూరంగా ఉన్నవారే స్వచ్ఛమైన శాఖాహారులు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

స్వచ్ఛమైన శాఖాహారం చాలా మంచిది.ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది.

కొన్ని అధ్యయనాల ప్రకారం గుండె వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది.స్వచ్ఛమైన శాఖాహారంలో కొవ్వు( Fat ) నిండిన ఆహార పదార్థాలు ఏవి ఉండవు.

కాబట్టి గుండె వంటి ప్రధాన అవయవాలు వ్యాధుల బారిన పడకుండా ఉంటాయి.దీని వల్ల జీవన కాలం పెరిగే అవకాశం కూడా ఉంది.

మాంసాహారం తినేవారి తో పోలిస్తే శాకాహారులు తక్కువ సంతృప్తి కొవ్వు, కొలెస్ట్రాల్( Cholesterol ), విటమిన్ సి విటమిన్ ఈ, పొటాషియం, మెగ్నీషియం, ఫైటో కెమికల్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తక్కువగా తీసుకుంటూ ఉంటారు.

"""/" / దీనివల్ల బరువు కూడా త్వరగా పెరగరు.అయితే శాకాహారులు చాలా జాగ్రత్తగా ఆహారాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

వీరిలో తరచుగా పోషకాహారం లోపం వచ్చే అవకాశం ఉంటుంది.శాకాహారం తీసుకునే వ్యక్తుల్లో విటమిన్ బి కాంప్లెక్స్, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు( Omega Fatty Acids ), ఐరన్, జింక్ వంటివి లోపించే అవకాశం ఎక్కువగా ఉంది.

కాబట్టి లోపాలు తీర్చుకోవడానికి సప్లిమెంట్లను తీసుకుంటూ ఉండాలి.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్.. కృష్ణవంశీ కామెంట్స్ వైరల్!