తులసి మొక్కకు పచ్చిపాలతో ఆరాధిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?
TeluguStop.com
సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.
ఈ క్రమంలోనే హిందువుల ఇంటి ఆవరణంలో మనకు తులసి మొక్క దర్శనమిస్తుంది.తులసి మొక్కను కేవలం దైవ సమానంగా భావించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న ఔషధ మొక్కగా కూడా భావిస్తారు.
ఎంతో పవిత్రంగా భావించే ఈ తులసి మొక్కకు ప్రతి రోజూ ఉదయం సాయంత్రం పూజలు చేస్తుంటారు.
ఈ విధంగా తులసి చెట్టుకు పూజ చేయడం వల్ల మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవని, వ్యాపారాలలో బాగా అభివృద్ధి సాధిస్తారని చెబుతారు.
మన ఇంట్లో పెళ్ళికి వచ్చిన అమ్మాయిలు లేదా అబ్బాయిలకు ఎన్ని రోజులకు పెళ్లి సంబంధాలు కుదరకపోతే ఈ రోజు తులసి చెట్టుకు పూజలు చేయటం వల్ల వివాహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
అదే విధంగా మన ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నప్పుడు కూడా తెలిసి మొక్కను ఆరాధించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి.
మన ఇంటి ఆవరణంలో ఎప్పుడూ కూడా తులసి మొక్కను ఆగ్నేయ దిశలో పెట్టాలి.
"""/" /
వ్యాపార రంగంలో ఉండే వారు వారికి వ్యాపారంలో నష్టాలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆరాధించాలి.
అదే విధంగా వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొనేవారు తులసి మొక్కకు పచ్చి పాలు, స్వీట్లతో పూజ చేయాలి.
ఈ విధంగా చేయడం వల్ల క్రమక్రమంగా వ్యాపారంలో ముందుకు సాగుతారు.ఈ విధంగా తులసి మొక్కకు నైవేద్యంగా సమర్పించిన పాలు స్వీట్లు మిగిలితే వాటిని వివాహిత స్త్రీకి దానం చేయడం వల్ల శుభ పరిణామాలు జరుగుతాయని.
అదే విధంగా మన ఇంట్లో ఏదైనా సమస్యలతో సతమత మవుతున్నప్పుడు ఒక ఐదు తులసి ఆకులను ఇత్తడి నీటి కుండలో వేసి 24 గంటల తర్వాత ఆ నీటిని ఇంటి బయట, ఇంటి లోపల చల్లుకుంటే మన ఇంట్లో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
సినిమా హిట్ అవ్వాలంటే ఆమె పాత్రని చంపేయాలి.. వివాదాస్పదమవుతున్న రానా, తేజ సజ్జా కామెంట్స్!