అయోడిన్ లోపాన్ని నిర్ల‌క్ష్యం చేశారో ఇక‌ అంతే సంగ‌తులు..జాగ్ర‌త్త‌!

అయోడిన్ లోపం ఇటీవ‌ల కాలంలో చాలా మందిలో క‌నిపిస్తున్న స‌మ‌స్య ఇది.అయితే స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల‌ ఈ స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేస్తూ రిస్క్ ప‌డుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

నిజానికి శ‌రీరానికి కావాల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో అయోడిన్ ఒక‌టి.శ‌రీరానికి స‌రిప‌డా అయోడిన్ అందితేనే అవయవాల ఎదుగుదల బాగుంటుంది.

అలాగే హర్మోన్లు, థైరాక్సిన్ ఉత్ప‌త్తి జ‌రుగుతుంది.మ‌రియు శరీరంలోని వివిధ జీవక్రియలు సక్రమంగా సాగుతాయి.

అదే ఒకవేళ అయోడిన్ లోపిస్తే థైరాయిడ్‌ గ్రంథి ప‌ని తీరు త‌గ్గి పోయి హైపోథైరాయిడ్‌కు దారితీస్తుంది.

జీవక్రియ నశిస్తుంది.అల‌స‌ట‌, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు త‌రచూ ఇబ్బంది పెడ‌తాయి.

బ‌రువు భారీగా పెరిగి పోతారు.కంటి చూపు దెబ్బ తింటుంది.

జ్ఞాప‌క శ‌క్తి త‌గ్గి పోతుంది.గ‌ర్భిణీల్లో మిస్ క్యారేజ్ అయ్యే రిస్క్ రెట్టింపు అవుతుంది.

ర‌క్తంలో చెడు కొలెడ‌స్ట్రాల్ పెరిగి పోతుంది.చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌కు సైతం ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌కు గురవుతారు.

"""/" / అందు వ‌ల్ల‌నే శ‌రీరానికి స‌రిప‌డా అయోడిన్ అందించాల‌ని అంటున్నారు మ‌రి అయోడిన్ లోపం ఏర్ప‌డ‌కుండా ఉండాలంటే ఏం చేయాలో చూస్తేంది.

అయోడైజ్డ్ ఉప్పును రోజూ ప‌ది గ్రాముల చొప్పున తీసుకోవాలి.దానిమ్మ పండ్లు, స్ట్రాబెర్రీ పండ్లు, అరటి పండ్లు, బంగాళదుంప, పెరుగు, గుడ్లు, పాలు వంటి ఆహారాల్లోనూ అయోడిన్ ఉంటుంది.

కాబ‌ట్టి వీటిని డైట్‌లో చేర్చుకోవాలి.అలాగే సీఫుడ్‌లోనూ అయోడిన్ ఉంటుంది.

అందుకే వారంలో రెండు సార్లు చేప‌లు, రొయ్య‌లు, పీత‌లు వంటివి తీసుకుంటే మంచిది.

పాలకూర‌లో సైతం అయోడిన్ పుష్క‌లంగా ఉంటుంది.సో, వారంలో క‌నీసం మూడు సార్లు అయినా పాల‌కూర తీసుకుంటే అయోడిన్ లోపం ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.

మ‌రియు ఆరోగ్యానికి ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ల‌భిస్తాయి.

న్యూట్రల్ ఓటర్లు జగన్ వైపేనా.. ఆ పనులు చేయడమే జగన్ కు ప్లస్ అవుతోందా?