శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన స్తోత్రం పటిస్తే..?
TeluguStop.com
సాధారణంగా శుక్రవారం సాక్షాత్తు ఆ మహాలక్ష్మికి మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు.
మన ఇల్లు సుఖ సంతోషాలతో, సకల సంపదలతో తులతూగుతూ ఉండాలంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా అవసరం.
అయితే అమ్మవారికి స్తోత్రం అంటే ఎంతో ప్రీతికరం.సాధారణంగా శివుడికి అభిషేకం అంటే ప్రీతికరం.
విష్ణుకు అలంకారం అంటే ఇష్టం, సూర్యుడికి నమస్కారం, వినాయకుడికి తర్పణం అదేవిధంగా అమ్మవారికి స్తోత్రం అంటే ఎంతో ప్రీతికరం.
అందువల్ల అమ్మవారి అనుగ్రహం కలగాలంటే కచ్చితంగా శుక్రవారం అమ్మవారి స్తోత్రాన్ని పఠిస్తూ పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి సకల సంపదలను ప్రసాదిస్తుందని వేద పండితులు తెలియజేస్తున్నారు.
మన కుటుంబంలో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలంటే శుక్రవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి "స్తుతా దిశసి కామం'' స్తోత్రం చేయటం వల్ల సర్వాభీష్టాలు కలుగుతాయి.
అలాగే పాపాలను ఈ స్తోత్రం పోగొడుతుంది.మనం కోరిన కోరికలు నెరవేరాలంటే శుక్రవారం మాత్రమే కాకుండా ప్రతిరోజు 108 సార్లు ఈ స్తోత్రాన్ని చదవటం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
అదే విధంగా ఈ అమ్మవారి స్తోత్రములు అమ్మవారి మహిమ, గుణము, లీల, రూపము, తత్త్వము గురించి తెలియజేస్తాయి.
"""/"/
అదేవిధంగా అమ్మవారి స్మరణ అనేది మనసుకు సంబంధించినది.కనుక అమ్మవారి స్మరణ చేయటం వల్ల మన జీవితంలో చేసిన పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
అదే విధంగా మనకు ఐశ్వర్యం కలగాలంటే శ్రీ సూక్తం విశేష ఫలితాలను కలిగిస్తుంది.
లక్ష్మీ దేవి అర్చనలో ఉపయోగించే పరమ శుద్ధ మంత్రాలనే శ్రీ సూక్తం అని కూడా పిలుస్తారు.
ప్రతి దినం తప్పకుండా ఈ సూత్రాలను చదవటం ద్వారా అమ్మవారి కృప మన పై కలుగుతుంది.
అమ్మవారికి ఎంతో ఇష్టమైన స్తోత్రాలు గురించి మనకు అధర్వణవేదం, ఋగ్వేదంలో కూడా తెలియ చేయబడ్డాయి.