వేస‌విలో పుట్టగొడుగులు తింటే ఆ స‌మ‌స్య‌కు దూరంగా ఉండొచ్చ‌ట‌!

వేస‌వి కాలం చూస్తుండ‌గానే వ‌చ్చేసింది.గ‌త రెండు, మూడు వారాల నుంచి ఎండ‌లు ఏ స్థాయిలో మండిపోతున్నాయో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్పాల్సిన ప‌ని లేదు.

అయితే వేస‌వి కాలంలో ప్ర‌ధానంగా వేధించే స‌మ‌స్య‌ల్లో డీహైడ్రేష‌న్ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

వ‌య‌సుతో సంబంధం లేకుండా కోట్లాది మంది స‌మ్మ‌ర్‌లో డీహైడ్రేష‌న్ బారిన ప‌డుతుంటారు.శ‌రీరంలో నీటి శాతం త‌గ్గిపోవ‌డాన్నే డీహైడ్రేష‌న్ అని అంటారు.

నీర‌సం, అస‌ల‌ట‌, క‌ళ్లు తిర‌గ‌డం, స‌రిగ్గా నిద్ర ప‌ట్ట‌క‌పోవ‌డం, త‌ల‌నొప్పి, మ‌ల‌బ‌ద్ధ‌కం, అధిక ర‌క్త‌పోటు, జాయింట్ పెయిన్స్ వంటివి దీని ల‌క్ష‌ణాలు.

ఈ ల‌క్ష‌ణాల‌ను నిర్ల‌క్ష్యం చేస్తే ప్రాణాలే రిస్క్‌లో ప‌డ‌తాయి.అందుకే డీహైడ్రేష‌న్ స‌మ‌స్య నుంచి ఎంత త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డితే ఆరోగ్యానికి అంత మంచిద‌ని నిపుణులు చెబుతుంటారు.

అయితే అందుకు కొన్ని కొన్ని ఫుడ్స్ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అలాంటి ఫుడ్స్‌లో పుట్ట‌గొడుగులు ఒక‌టి.

కాల్షియం, ఐర‌న్‌, పొటాషియం, మెగ్నీషియం, జింక్, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ డి, ఫైబ‌ర్‌, ప్రోటీన్‌తో పాటు పుట్ట‌గొడుగుల్లో వాట‌ర్ కంటెంట్ కూడా పుష్క‌లంగా ఉంటుంది.

"""/"/ అందువ‌ల్ల, వేస‌విలో పుట్ట‌గొడుగుల‌ను త‌ర‌చూ తీసుకుంటే డీహైడ్రేష‌న్ స‌మ‌స్య‌కు దూరంగా ఉండొచ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పైగా పుట్ట‌గొడుగుల‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల మ‌ధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది.వెయిట్ లాస్ అవుతారు, శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా కూడా ఉంటాయి.

అందుకే పుట్టగొడుగులను త‌ప్ప‌కుండా ఆహారంలో భాగం చేసుకోవాలి.అలాగే వేసవి కాలంలో డీహైడ్రేష‌న్ స‌మ‌స్య‌ను వ‌దిలించుకోవాలంటే పుట్ట‌గొడుగుల‌తో పాటు పుచ్చ‌కాయ‌, క‌ర్బూజ‌, ట‌మాటో, దోస‌కాయ‌, ఆపిల్ పండ్లు, స్ట్రాబెర్రీలు, అర‌టి పండ్లు, కొకొన‌ట్ వాట‌ర్‌, స‌బ్జా వాట‌ర్‌, బార్లీ వాట‌ర్, రాగి జావ‌ వంటి వాటిని కూడా తీసుకోవాలి.

ఈ ఆహారాలు సైతం శ‌రీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.