భోజ‌నం త‌ర్వాత డ్రై ఫ్రూట్స్ తినొచ్చా..? తింటే ఏం అవుతుంది?

డ్రై ఫ్రూట్స్.వీటి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.

డ్రై ఫ్రూట్స్ ధ‌ర కాస్త ఎక్కువే అయిన‌ప్ప‌టికీ.అందుకు త‌గ్గా విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్‌, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబ‌ర్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు నిండి ఉంటాయి.

అందుకే డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

మ‌రియు వివిధ ర‌కాల జ‌బ్బుల‌ను సైతం నివారిస్తాయి.ఈ నేప‌థ్యంలోనే చాలా మంది త‌మ రెగ్యుల‌ర్ డైట్ లో డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకుంటారు.

అయితే కొంద‌రికి భోజ‌నం తిన్న వెంట‌నే డ్రై ఫ్రూట్స్ తినే అల‌వాటు ఉంటుంది.

అస‌లు భోజ‌నం త‌ర్వాత డ్రై ఫ్రూట్స్ తినొచ్చా.? అంటే నిశ్చింత‌గా తిన‌మ‌నే చెబుతున్నారు నిపుణులు.

డ్రై ఫ్రూట్స్‌లో ఫైబ‌ర్ కంటెంట్ పుష్క‌లంగా ఉంటుంది.అందువ‌ల్ల భోజ‌నం చేసిన వెంట‌నే బాదం, పిస్తా, జీడిప‌ప్పు, ఎండుద్రాక్ష, డ్రై ఆప్రికాట్లు వంటి వాటిని ప‌రిమితంగా తీసుకుంటే జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారి.

తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది.ఫ‌లితంగా గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

"""/"/ అలాగే డ్రై ఫ్రూట్స్‌ను ఉద‌యం పూట కూడా తీసుకోవచ్చు.ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ స‌మ‌యంలో గుప్పెడు డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటే.

రక్తహీనత, గుండె జబ్బులు వంటివి ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

ఎముకలు బలంగా, పటుత్వంగా మార‌తాయి.మెద‌డు ప‌నితీరు మెరుగుప‌డి జ్ఞాప‌క శ‌క్తి రెట్టింపు అవుతుంది.

క్యాన్స‌ర్‌, అల్జీమ‌ర్స్ వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.ర‌క్త‌పోటు స్థాయిలు అదుపు త‌ప్ప‌కుండా ఉంటాయి.

మ‌రియు చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతివంతంగా సైతం మెరుస్తుంది.కాబ‌ట్టి, డ్రై ఫ్రూట్స్‌ను త‌ప్ప‌కుండా ఆహారంలో భాగం చేసుకోండి.

విడాకులు పెరగడానికి కారణం ఆడవాళ్లే.. సరస్వతీ ప్రదీప్ షాకింగ్ కామెంట్స్ వైరల్!