యాపిల్‌ను‌ తొక్కతో తింటున్నారా? లేకుంటే ఇవి తెలుసుకోవాల్సిందే!

యాపిల్‌ను‌ తొక్కతో తింటున్నారా? లేకుంటే ఇవి తెలుసుకోవాల్సిందే!

యాపిల్‌ దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధికంగా వినియోగించే పండ్ల‌లో యాపిల్ పండు ఒక‌టి.

యాపిల్‌ను‌ తొక్కతో తింటున్నారా? లేకుంటే ఇవి తెలుసుకోవాల్సిందే!

యాపిల్ పండు రుచిలోనే కాదు.పోష‌కాలు కూడా మెండుగా ఉంటాయి.

యాపిల్‌ను‌ తొక్కతో తింటున్నారా? లేకుంటే ఇవి తెలుసుకోవాల్సిందే!

అందుకే ఆరోగ్య నిపుణులు రోజుకో యాపిల్ పండైనా తీసుకోవాల‌ని చెబుతుంటారు.అయితే యాపిల్ పండ్ల‌ను పెంచే క్ర‌మంలో ర‌సాయ‌నాలు, మందులు వాడ‌తార‌న్న కార‌ణంగా చాలా మంది తొక్క తీసేసి తింటుంటారు.

అయితే ఇలా వ‌ల్ల ఎన్నో పోష‌కాల‌ను కూడా దూరం చేసుకున్న‌ట్టే అవుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

వాస్త‌వానికి యాపిల్ గుజ్జులో కంటే తొక్క‌లోనే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉంటాయి.

అలాగే లివ‌ర్ క్యాన్స‌ర్‌‌, లంగ్ క్యాన్స‌ర్‌, పెద్ద పేగు క్యాన్స‌ర్‌, రొమ్ము క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల ద‌రి చేర‌కుండా ర‌క్షించే శ‌క్తి కూడా యాపిల్ తొక్క‌లోనే ఉంటుంది.

శ‌రీరంలో అన‌ద‌న‌పు కొవ్వు క‌రిగించే ఉర్సోలిక్ ఆమ్లం యాపిల్ తొక్క‌లోనే ల‌భిస్తుంది. """/" / అందుకే బ‌రువు త‌గ్గాలి అని ప్ర‌య‌త్నించే వారు యాపిల్‌ను తొక్క‌తో తింటేనే మంచిద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే యాపిల్ పండును తొక్క‌తోనే అందులో ఉండే క్యాల్షియం, పొటాషియం, ఐర‌న్‌, ఫాస్పరస్, విట‌మిన్ సి వంటి పోష‌కాలు మ‌న శ‌రారానికి పూర్తిగా అందుతాయి.

అయితే యాపిల్ పండు తొక్క‌తో తింటే ఆరోగ్యానికి మంచిదే.కానీ, తినే ముందు ఖ‌చ్చితంగా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

పైన చెప్పుకున్న‌ట్టు యాపిల్ పండ్ల‌ను పెంచే క్ర‌మంలో ఎన్నో కెమెక‌ల్స్ వాడ‌తారు.అందువ‌ల్ల‌, యాపిల్ పండుపై తెల్ల‌ని మైనం ఏడ్పుతుంది.

కేవ‌లం నీటితో క‌డిగినంత మాత్రాన ఈ మైనం పూర్తిగా పోదు.అందుకే యాపిల్ పండు తినే ముంద ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను నీటిలో కలిపి అందులో యాపిల్ పండ్ల‌ను శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

లేదా వాట‌ర్‌లో ఆపిల్ సీడర్ వెనిగర్ వేసి అందులో యాపిల్ పండ్ల‌ను క‌డిగినా శుభ్రంగా మార‌తాయి.