మ‌ధుమేహం ఉన్న‌వారు ప‌న‌సపండు తింటే ఏం అవుతుందో తెలుసా?

మ‌ధుమేహం లేదా షుగ‌ర్ వ్యాధి నేటి కాలంలో ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా చాలా మందిని ప‌ట్టి పీడిస్తున్న స‌మ‌స్య ఇది.

రక్తంలో చక్కర స్థాయిలు ఉండాల్సిన దానికంటే ఎక్కువ‌గా ఉండ‌ట‌మే మ‌ధుమేహం.శరీరం లో ఇన్సులిన్ తగ్గడం వల్ల ఈ ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది.

ఇక ఒక్క సారి మ‌ధుమేహం వ‌చ్చిందంటే జీవిత కాలం వేధిస్తూనే ఉంటుంది.అలాగే మ‌ధుమేహం వ్యాధి ఉన్న వారు ఎన్నో జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా ఆహారం విష‌యంలో అనేక నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది.అయితే మ‌ధుమేహం ఉన్న వారు పండ్ల‌ను తీసుకోవ‌డానికి భ‌య‌ప‌డుతుంటారు.

అలాంటి వాటిలో ప‌న‌స పండు ఒక‌టి.తియ్య‌టి రుచి క‌లిగి ఉండే ఈ ప‌న‌స పండు తీసుకుంటే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగిపోతాయేమోన‌ని టెన్ష‌న్ ప‌డ‌తాడు.

మ‌రి ఇంత‌కీ మ‌ధుమేహం ఉన్న వారు ప‌న‌స పండు తినొచ్చా తిన‌కూడ‌దా అంటే ఆరోగ్యం నిపుణులు ఎలాంటి భ‌యం లేకుండా తీసుకోవ‌చ్చ‌ని అంటున్నారు.

"""/"/ అవును, పనస పండు మ‌ధుమేహం వ్యాధి ఉన్న వారికి మంచి ఆహారం.

ప‌న‌స పండులో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐర‌న్‌, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.

అలాగే పనస పండులో సహజసిద్ధ చక్కెర్లు, ఫైబర్ కూడా ఉంటాయి.అందువ‌ల్ల‌, పండు తీసుకుంటే శరీరానికి ఇన్సులిన్అందించిన దానితో సమానం అవుతుంది ఫ‌లితంగా, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి.

కాబట్టి మధుమేహ రోగులు ఎలాంటి అపోహ‌లు పెట్టుకోకుండా ప‌న‌స‌ పండు తీసుకోవ‌చ్చు.ఇక సామాన్యులు ప‌న‌స పండు తీసుకుంటే మ‌ధుమేహం వ్యాధి రాకుండా ఉంటుంది.

అయితే అతిగా మాత్రం ప‌న‌స పండు తీసుకోరాదు.ఆరోగ్యానికి ఎంత మేలు చేసి న‌ప్ప‌టికీ ప‌న‌స పండును ఓవ‌ర్‌గా తీసుకుంటే అనేక ఆనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

యంగ్ డైరెక్టర్లు కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నారా..?