చలికాలంలో పెరుగు తినొచ్చా.. తినకూడదా.. ఖచ్చితంగా తెలుసుకోండి!
TeluguStop.com
ప్రతి రోజు తీసుకునే ఆహారాల్లో ఖచ్చితంగా పెరుగు ముందు ఉంటుంది.చాలా మందికి రోజూ భోజనంలో చివరిగా పెరుగు లేకుంటే ఏదో వెలితిగా ఉంటుంది.
అంతలా పెరుగుకు అలవాటు పడిపోతుంటారు.రుచిలోనే కాదు.
ఆరోగ్య పరంగా, సౌందర్య పరంగా కూడా పెరుగు అద్భుతంగా ఉపయోగపడుతుంది.అయితే చాలా మంది చలి కాలం వచ్చిందంటే పెరుగు తినడం మానేస్తుంటారు.
ఈ వింటర్ సీజన్‌లో పెరుగు తినడం వల్ల జలువు లేదా ఇతర శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని నమ్మడమే అందుకు కారణం.
అయితే చలి కాలంలో ఎలాంటి భయం లేకుండా పెరుగు తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఈ వింటర్ సీజన్‌లో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా పెరుగు తినాలట.
ఎందుకంటే, పెరుగు తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.ఫలితంగా సీజనల్‌గా వచ్చే రోగాలకు అడ్డుకట్ట వేయవచ్చు.
అలాగే పాలతో పోల్చుకుంటే పెరుగులోనే ప్రోటీన్లు అధిక మోతాదులో ఉంటాయి.కాబట్టి, పెరుగు తీసుకుంటే చర్మాన్ని, కేశాలను, గోర్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మలబద్ధకం లేదా ఇతర జీర్ణ సమస్యలతో బాధ పడేవారు ఖచ్చితంగా పెరుగు తీసుకోవాలి.
ఎన్నో పోషకాలు నిండి ఉన్న పెరుగు ప్రతి రోజు తీసుకుంటే.జీర్ణ శక్తి పెరుగుతుంది.
అదే సమయంలో మలబద్ధకం సమస్య కూడా దూరం అవుతుంది.ఇక ఎముకలను, దంతాలను మరియు కండరాలను బలపరిచే కాల్షియం కూడా పెరుగులో సమృద్ధిగా ఉంటుంది.
అందువల్ల, పెరుగును రెగ్యులర్‌గా తీసుకోవడం చాలా మంచిది.అయితే చలి కాలంలో పెరుగు రెండు పూటలా కాకుండా.
కేవలం పగటి పూటే తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు.అంతగా తినాలి అనిపిస్తే.
మజ్జిగా రూపంలో తీసుకోవచ్చు.ఇక ఆస్తమా వ్యాధి ఉన్న వారు మాత్రం ఈ చలి కాలంలో రాత్రి వేళలో పెరుగు, మజ్జిగ వంటి వాటికి దూరంగానే ఉండాలి.
షాకింగ్ వీడియో: పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు.. విద్యార్థిని నుజ్జునుజ్జు!