Kiran Abbavaram : తప్పుడు ప్రచారాలతో తొక్కేస్తున్నారు.. కిరణ్ అబ్బవరం పోస్ట్ పై నెటిజన్స్ సెటైర్స్?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మొదట 2019లో విడుదల అయిన రాజా వారు రాణి గారు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ఆ తర్వాత 2021 లో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఎస్ఆర్ కళ్యాణమండపం( SR Kalyanamandapam ) సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను సాధించి కిరణ్ అబ్బవరం ని కమర్షియల్ హీరోగా పరిచయం చేసింది.

"""/" / తరువాత వరుసగా ఏడాదికి రెండు మూడు సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు కిరణ్ అబ్బవరం.

కాగా ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాయి.

ఇది ఇలా ఉంటే వినరో భాగ్యము విష్ణు కథ సినిమా విడుదల సందర్భంగా కిరణ్‌ అబ్బవరం సంచలన కామెంట్లు చేశారు.

కొందరు సోషల్‌ మీడియా వేదికగా తనను టార్గెట్‌ చేసి తొక్కేస్తున్నారని, అలాంటి వారికి భయపడేది లేదని తెలిపారు కిరణ్‌ అబ్బవరం.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కిరణ్ పై ట్రోలింగ్స్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.

సినిమాలపై కిరణ్ కి ఉన్న ఇష్టం డెడికేషన్ గురించి మనందరికీ తెలిసిందే. """/" / ప్యాషన్‌ పరంగా ఎలాంటి పేరు పెట్టడానికి లేదు.

ఎంతో కమిట్‌మెంట్‌తో, కష్టంతో మొదటి నుంచి సినిమాలు చేస్తూ వస్తూ ఉన్నారు.ప్రతీ సినిమాకు మధ్య వేరియేషన్స్‌ చూపించటానికి ‍ప్రయత్నిస్తున్నాడు మన యంగ్ హీరో.

అన్ని బాగానే ఉన్నాయి కానీ కథలో ఎంపిక విషయంలో మాత్రం కిరణ్ అబ్బవరం ఫెయిల్ అవుతున్నాడని పలువురు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కథలో పసలేనప్పుడు ఓ సినిమా ఎంత కష్టపడి తీసినా కూడా వ్యర్థమే అని అంటున్నారు.

మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోతున్నారు.చిన్న సినిమానా, పెద్ద సినిమానా అన్న దానికంటే సినిమాలో మంచి కథ ఉందా లేదా అన్నదానికే ప్రేక్షకులు ప్రాముఖ్యత ఇస్తున్నారు.

ఇలాంటి సమయంలో కిరణ్‌ అబ్బవరం కథల మీద దృష్టి పెడితే అనుకున్న విజయాన్ని సొంతం చేసుకోగలుగుతాడు.

కిరణ్ అబ్బవరని ఎవరు తొక్కేయడం లేదు తనని తానే తొక్కేసుకుంటున్నాడు అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ వాఖ్యలను కిరణ్ అబ్బవరం ఏకీభవిస్తారో లేదో చూడాలి మరి.

హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం.. వాహనదారుల ఇక్కట్లు