ఏపీ బీజేపీ లో ఆ నేతలు ఏమయ్యారు ? 

ఏపీలో బిజెపి( BJP ) పరిస్థితి ఏమిటనది ఎటు అర్థం కాకుండా ఉంది.

ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన దగ్గుపాటి పురంధేశ్వరి( Daggupati Purandheswari ) దూకుడు ప్రదర్శిస్తున్నారు.

ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు చేస్తూ ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధుల విషయంపైన ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల పైన పురందరేశ్వరి విమర్శలు, ఫిర్యాదులు చేస్తూ వైసిపి( YCP ) ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు.

దీంతో వైసిపి కూడా రంగంలోకి దిగి  పురందరేశ్వరుని టార్గెట్ చేసుకుంది.  వ్యక్తిగత విమర్శలు మొదలుపెట్టింది .

టిడిపికి మేలు చేసే విధంగా పురందరేశ్వరి వ్యవహరిస్తున్నారని, బావ కళ్ళలో ఆనందం చూసేందుకు పురందరేశ్వరి వైసీపీని మాత్రమే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారని వైసిపి ఆరోపిస్తోంది.

"""/" / తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తుండడం పై పురందరేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వైసిపి నాయకులను మరింతగా టార్గెట్ చేసుకుంటున్నారు.

ఇంత జరుగుతున్నా,  ఏపీ బీజేపీ నేతలు పెద్దగా స్పందించకపోవడం , ఆ పార్టీలోనే కీలక నేతలుగా ఉన్నవారు పూర్తిగా సైలెంట్ అవ్వడం వంటి వ్యవహారాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

  మొదటి నుంచీ బిజెపిలో గ్రూపు రాజకీయాలు కొత్తేమీ కాదు.గతంలో ఏపీ బిజెపి అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణకు చాలామంది నేతలు సహాయ నిరాకరణ చేసేవారు .

అసలు కాంగ్రెస్ ( Congress )లో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తికి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఎలా అప్పగించారు అంటూ బహిరంగంగానే ఫైర్ అయ్యేవారు.

  ఇక ఆయన తర్వాత బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చినవారే .

ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోను ఏపీ బీజేపీ రెండు వర్గాలుగా ఉండేది. """/" / చాలామంది నేతలు సోమ వీర్రాజుకు సహాయ నిరాకరణ చేసేవారు .

ఇక ఆయన తర్వాత బాధ్యతలు స్వీకరించిన పురందరేశ్వరి విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

పురందరేసరికి మద్దతుగా నిలబడుతూ ఆమెపై పార్టీ పరంగాను, వ్యక్తిగతంగాను చేస్తున్న విమర్శలను  తిప్పి కొట్టే విషయంలో పార్టీ నాయకులు ఎవరు అంతగా స్పందించడం లేదు.

బిజెపి కీలక నేతలుగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి,  విష్ణు కుమార్ రాజు,  సత్య కుమార్ , సోము వీర్రాజు ఇలా చాలామంది నేతలే సైలెంట్ అయిపోవడం తో అసలు ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది అనే చర్చ తెరపైకి వచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే నా పెళ్లి జరిగేది కాదు.. అశ్వనీదత్ కూతురు కామెంట్స్ వైరల్!