తెలంగాణ బీజేపీ పరిస్థితి ఇలా అయ్యిందేంటి ? 

తెలంగాణ బిజెపిలో( BJP ) గందరగోళ పరిస్థితి నెలకొంది.ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ఈ తరహా పరిస్థితి ఏర్పడడం ఆ పార్టీ అగ్రనాయకత్వానికి ఆందోళన కలిగిస్తుంది.

గతంలో ఉన్నంత ఉత్సాహం తెలంగాణ బిజెపి నాయకుల్లో లేకపోవడం , చేరికలు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం వంటివి దడ పుట్టిస్తున్నాయి.

పార్టీ నుంచి వెళ్లేవారు తప్ప,  చేరే వారు కనిపించకపోవడం మరింత కంగారు పుట్టిస్తుంది.

పార్టీలో చేరికలను ప్రోత్సహించడమే లక్ష్యంగా చేరికల కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి,  దానికి ఈటెల రాజేందర్( Etela Rajender ) ను అధ్యక్షుడిగా నియమించారు.

టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా పనిచేసిన రాజేందర్ ను ఈ పదవిలో నియమించడం ద్వారా,  పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు బిజెపిలో చేరుతారని ఆ పార్టీ అధిష్టానం అంచనా వేసినా, అంతంత మాత్రమే అన్నట్లుగా చేరికలు ఉన్నాయి.

"""/" / ఇక ఇటీవల బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత,  ఆ పార్టీలోని అసంతృప్తులు బిజెపి వైపు చూస్తారని భావించినా, వారిలో మెజార్టీ నాయకులు కాంగ్రెస్ వైపే ఆసక్తి చూపిస్తుండడం బిజెపిలో నెలకొన్న పరిస్థితికి అర్థం పడుతుంది.

ఇటీవలే మాజీ మంత్రి కృష్ణ యాదవ్( Former Minister Krishna Yadav ) ను బిజెపిలో చేర్చుకునేందుకు ఈటెల రాజేందర్ ప్రయత్నించారు.

అయితే ఆయన పార్టీలో చేరే రోజునే కిషన్ రెడ్డి దానికి అడ్డంపడ్డారు.తన నియోజకవర్గంలో తనకు కనీసం సమాచారం అందించకుండా కృష్ణ యాదవ్ ను పార్టీలోకి ఎలా తీసుకుంటారు అంటూ ఆయన ప్రశ్నించడంతో ఆ చేరిక కు బ్రేక్ పడింది.

అలాగే మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడిని  కిషన్ రెడ్డి( Kishan Reddy ) పార్టీలోకి ఆహ్వానించారు.

అయితే ఆ నియోజకవర్గంలో తుల ఉమ కు వేములవాడ టికెట్ ఇస్తానని గతంలో ఈటల రాజేందర్ హామీ ఇచ్చి పార్టీలో తీసుకున్నారు.

  అయితే ఇప్పుడు విద్యాసాగర్ రావు కుమారుడిని చేర్చుకోవడంతో ఈటెల రాజేందర్ తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు.

"""/" / ఇక ఖమ్మం సభలో 22 మంది బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

ఒక్కరు కూడా చేరకపోవడం బిజెపి అధిష్టానానికి ఆగ్రహం కలిగించాయి.పార్టీలో కీలక నాయకులుగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , వివేక్, రవీందర్ నాయక్ వంటి నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు  ప్రయత్నాలు చేస్తూ ఉండడం , ఇటీవల పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయడం ఇంకా అనేక మంది నేతలు పార్టీ మారే ఆలోచనతో ఉండడం వంటి వ్యవహారాలు తెలంగాణ బీజేపీ లో మరింత నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి.

వేల మందికి తలో రూ.10 వేలు సహాయం చేసిన ప్రభాస్.. ఇలాంటి హీరో ఉండరంటూ?