మంత్రి ధర్మానకు ఏమైంది ? ఆ స్పీడ్ ఓవర్ స్పీడ్ అవుతోందా ?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ధిక్కార స్వరాలు ఒకవైపు పెరిగిపోతుండగా, మరోవైపు పార్టీ సీనియర్ నాయకులు, రాజకీయ ఉద్దండులు గా ఉన్న కొంతమంది వైసీపీ సీనియర్ నేతలు  వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు.

ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఉన్న వైసిపి ఎమ్మెల్యే , మంత్రి ధర్మాన ప్రసాదరావు గత కొద్దిరోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు వైసిపి లోను, ప్రజలలోనూ చర్చనీయాంసంగా మారాయి.

  అమరావతి, మూడు రాజధానుల వ్యవహారం చర్చుకు వచ్చిన సందర్భంలో ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటూ కొత్త చర్చను తెరపైకి తెచ్చారు.

అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు ఆయన చేస్తున్నారు.

"""/"/ టిడిపి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తుందని, మీ ఉద్యోగాలు ఉండాలంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వ రావాలంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పరోక్షంగా రియల్ లైఫ్, రీల్ లైఫ్ వేరు అంటూ .

హీరోలకు అభిమానులుగా ఉండాలి కానీ, నిజజీవితంలో కాదు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి ధర్మాన సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు అన్ని ప్రభుత్వం సమకూర్చుతున్నా.యువత హీరో వెంట తిరగడం ఏమిటి అంటూ పరోక్షంగా పవన్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు.

"""/"/ దీంతో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు జనసేన భయం పట్టుకుందని, రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో జనసేన ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని ముందుగా అంచనా వేసే ముందస్తుగా అయిన జనసేన ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి.

పార్టీలోనూ, ప్రభుత్వం పైన నెలకొన్న అసహనాన్ని ధర్మాన ఈ విధంగా చూపిస్తున్నారా ? రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన వల్ల తమకు ఇబ్బందులు ఏర్పడతాయని ముందుగానే పార్టీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

జనసేన గురించి.వాలంటీర్ల వ్యవస్థ గురించి ధర్మాన తన దాటి మాట్లాడుతున్నారని, ప్రభుత్వం ఏం చేస్తుందో గొప్పగా చెప్పుకునే అవకాశం ధర్మానికి ఉంది కానీ ఈ విధంగా విమర్శలు చేయడం సరికాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 2, గురువారం 2024