Allari Naresh : సినిమా పైన సినిమా తీస్తున్న పాపం ఎందుకో ఈ అల్లరోడికి కాలం కలిసి రావడం లేదు
TeluguStop.com
అల్లరి నరేష్( Allari Naresh ).అత్యంత స్పీడుగా సినిమాలను తెరకెక్కించగల సత్తా ఉన్న హీరో.
టాలీవుడ్ లో కమెడియన్స్ కొరత ఉన్నప్పుడు అల్లరి నరేష్ తెరపైకి దూసుకొచ్చాడు.తండ్రి ఈవివి సత్యనారాయణ తన అన్న ఆర్యన్ రాజేష్( Aryan Rajesh ) హీరో చేయాలని భావిస్తే అనుకోకుండా నరేష్ హీరోగా వెండితెరపై అనేక సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు.
2002లో అల్లరి సినిమాతో మొదలైన నరేష్ సినిమా ప్రస్థానం ప్రస్తుతం ఉగ్రం చిత్రం వరకు చేరింది.
దాదాపు 60 సినిమాలకు పైగానే నటించి అతి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు తీసిన హీరోగా ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఒక రికార్డు సృష్టించాడు అల్లరి నరేష్.
"""/" /
అయితే చిన్న చిన్న హీరోలు సైతం అద్భుతమైన కంటెంట్ తో చిత్రాలు తీస్తూ జనాలను దృష్టిలో పడుతుంటే, 20 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ అల్లరి నరేష్ ఎందుకో కాస్త వెనక పడ్డాడు అని చెప్పాలి.
చేస్తున్న సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉన్న అందులో విజయాల సంఖ్య తగ్గుతూ వస్తుంది.
ఆయనకు ఒక సరైన హిట్ లేక చాలా రోజులైంది.మహేష్ బాబు నటించిన మహర్షి( Maharshi ) సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు కానీ ఆ చిత్రానికి సంబంధించిన క్రెడిట్ మొత్తం మహేష్ బాబుకి దక్కింది.
అయితే రాను రాను తను సోలోగా సినిమాలు తీసే పరిస్థితి కూడా మారుతూ వస్తోంది.
సినిమాలో అవసరమైతే మరొక హీరో ని పెట్టుకొని మల్టీస్టారర్ మూవీగా తీయడానికి కూడా అల్లరి నరేష్ వెనకాడటం లేదు.
అయినా కూడా అదృష్టం చాలా దూరంలో కనిపిస్తోంది నరేష్ కి. """/" /
ఇక ఇప్పుడు ఉగ్రం( Ugram ) సినిమాలో లిరికల్ వీడియోలు విడుదలవుతున్నాయి ఆ చిత్రంలో అల్లరి నరేష్ మాస్ ఎలివేషన్స్ లో బాగానే కనిపిస్తున్నాడు ఈ మధ్యకాలంలో తన జోనర్ కి సంబంధం లేకుండా పక్కకు తప్పుకొని సినిమాలు తీయడం వల్ల తన కెరియర్ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది అయితే ఇది మంచి పరిణామం అనే అనుకోవాలి.
ఇప్పుడు హీరోలు సైతం కామెడీ చేస్తూ ఏదో ఒకలా గుర్తింపు దక్కించుకునే రోజులు అందుకే అల్లరి నరేష్ తనదైన పాత్రలు చేసుకుంటూ వెళుతున్నాడు.
కానీ ఒక సాలిడ్ హిట్టు పడితే తప్ప ఆతడిని ప్రేక్షకులు గుర్తించే అవకాశం లేదు.
ఈ వీడియో చూస్తే.. మీ కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం..