Shanti Priya : నా భర్త చనిపోవడానికి ముందు పెద్ద గొడవ అయ్యింది : శాంతి ప్రియ

శాంతి ప్రియ( Shanthi Priya ) అనగానే మనకు భానుప్రియ చెల్లెలుగానే బాగా పరిచయం.

అలాగే కొన్ని సినిమాల్లో నటించిన ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు అని అనుకుంటాం కానీ శాంతి ప్రియ గురించి మనకు తెలియని చాల విషయాలు ఉన్నాయి.

ఆమె 1987 లో ఎంగా ఊరు పట్టుకరన్ అనే తమిళ సినిమా ద్వారా మొదటి సారి వెండితెరకు పరిచయం అయ్యింది.

ఇక తెలుగు లో మాత్రం భాను ప్రియ( Bhanu Priya ) ను స్టార్ హీరోయిన్ ని చేసిన పెద్ద వంశి గారే శాంతి ప్రియను కూడా హీరోయిన్ గా చేసారు.

ఆయన తీసిన మహర్షి సినిమా పెద్దగా విహాయవంతం కాకపోయినా ఆ సినిమాలో పాటలు మాత్రం ఇప్పటికి చెవుల్లో అలా వినిపిస్తూనే ఉంటాయి.

""img Src= శాంతి ప్రియ కూడా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపును అయితే సాధించుకుంది కానీ తెలుగు లో ఎక్కువగా అవకాశాలు రాలేదు.

ఆమె కెరీర్ లో తమిళ్ లో ఎక్కువ సినిమాల్లో కనిపించగా, ఆ తర్వాత హిందీ చిత్రాల్లో ఎక్కువగా నటించింది.

అందుకే ఆమె హిందీ నటుడు అయినా సిద్ధార్థ్ రే( Siddharth Ray )అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఈ సిద్ధార్థ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయినా వి శాంతారాం మనవడు కావడం విశేషం.

సిద్ధర్థ్ సైతం బాలీవుడ్( Bollywood ) లో కొన్ని సినిమాల్లో నటించాడు.వీరిద్దరూ 1992 లో వివాహం చేసుకోగా ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

అయితే పెళ్లయ్యాక మాత్రం శాంతి మరియు సిద్ధార్థ్ కొన్ని విషయాల్లో బాగా గొడవలు పడే వారు అంటూ ఆమె ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది.

"""/"/ తన భర్త చనిపోయే ముందు వరకు కూడా మాకు చాల గొడవలు ఉన్నాయని, ఆ టైం లో పెద్ద అబ్బాయి కి కేవలం 10 ఏళ్ళు అని చిన్న బాబు కు 4 ఏళ్ళు అని తెలిపింది శాంతి ప్రియ.

అయితే తమ మధ్య బాగా గొడవలు పెరడంతోనే కాస్త ప్రెజర్ కి గురైన సిద్ధార్థ్ హార్ట్ అటాక్ తో మరణించారని తెలిపింది.

ఇక పిల్లలు పుట్టాక సినిమాలు మానేసిన శాంతి సిద్దార్థ్ మరణం తర్వాత కుటుంబం కోసం మళ్లి మేకప్ చేసుకుంది.

అప్పటి నుంచి అనేక హిందీ సీరియల్స్ లో నటిస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది.

ఇప్పుడు తన కుమారులు బాగా సెటిల్ అయ్యారంటుంది శాంతి.

చిరంజీవి సినిమాను ఆ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్న శ్రీకాంత్ ఓదెల…మరి ఇది వర్కౌట్ అవుతుందా..?