తొలి సినిమా ఫ్లాప్ తర్వాత ఎస్వీఆర్ ఏం చేశాడో తెలుసా?

ఎస్వీ రంగారావు.తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ను మించిన నటుడు.

తన అద్భుత నటనతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు ఈ తెలుగు నటుడు.సినిమాలపై ఉన్న మోజుతో నటుడిగా అవకాశం కోసం మద్రాసుకు వెళ్లాడు ఎస్వీఆర్.

సినిమా అవకాశం కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు.తినడానికి తిండిలేక ఎన్నో సార్లు మంచినీళ్లు మాత్రమే తాగి రోజులు గడిపాడు.

ఉండటానికి వసతి లేక అవస్థలు పడ్డాడు.తనకు అవకాశాలు రావు అనుకుని తిరిగి ఇంటికి వెళ్లాలి అనుకున్నాడు.

అదే సమయంలో తాత మనవడు సహా పలు సినిమాలు తీసిన నిర్మాత రాఘవ వద్దని చెప్పాడు.

ఎస్వీఆర్ తో పాటు తను కూడా సినిమాల్లో అవకాశం కోసం మద్రాసుకు వచ్చాడు.

ఇద్దరూ కలిసి ఒకేదగ్గర ఉండే వారు.ఎస్వీఆర్ నాటకాలు చక్కగా వేసే వాడు.

అలా కాకినాడలో పరిచయం అయిన అంజలీదేవి మద్రాసులో వారు పడుతున్న ఇబ్బందులను చూసింది.

తన ఇంట్లో ఉన్న అయ్యర్ కు వీరిని పరిచయం చేసింది.ఎప్పుడు వచ్చినా వీరికి భోజనం పెట్టాలని చెప్పింది.

కొద్ది రోజులల తర్వాత ఎస్వీఆర్ వరూధిని అనే సినిమా చేశారు.1946లో విడుదల అయిన ఈ సినిమా పరాజయం పాలైంది.

దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.తొలి సినిమానే ఫ్లాప్ కావడంతో ఆయనకు బాధతో పాటు అవమానం కలిగింది.

తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు.అదే సమయంలో ఆయన ఇంటికి చేరాడు.

"""/"/ తన కుటంబ సభ్యులు ఆయనను పెళ్లి చేసుకోవాలని చెప్పాడు.అంతేకాదు.

ఆయన మనకోడలిని ఇచ్చి వివాహం చేశారు.సంసార బాధ్యతలు కూడా మీద పడ్డాయి.

ఏం చేయాలో తెలియక.ఉద్యోగం కోసం జంషెడ్‌పూర్‌ కు వెళ్లాడు.

ఆయ‌న అక్క‌డ ఉద్యోగంలో చేరాడు.అదే సమయంలో డైరెక్ట‌ర్ బి.

ఎ.సుబ్బారావు నుంచి ఆయనకు పిలుపు వ‌చ్చింది.

ఆ త‌ర్వాత నాలుగైదు సినిమాలు చేశాడు.1951లో పాతాళ‌భైర‌వి సినిమా చేశాడు.

అందులో మాంత్రికుడి పాత్ర‌తో కనీవినీ ఎరుగని రీతిలో పేరు ప్రఖ్యాతులు పొందాడు.అప్పటి నుంచి తను వెనుతిరిగి చూసుకోలేదు.

తను చనిపోయే వరకు సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

హుస్సేన్ సాగర్ లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ ప్రారంభం..