నేడు వరంగల్ సభలో మహిళలకు రేవంత్ చెప్పనున్న గుడ్ న్యూస్ ఏంటి ? 

తెలంగాణలో కాంగ్రెస్(Congress Telangana) ప్రభుత్వానికి మరింత హైప్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు  సీఎం రేవంత్ రెడ్డి(cm Revanth Reddy).

పార్టీ అధికారంలోకి దాదాపు ఏడాది పూర్తవుతుంది.దీంతో పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున భారీగా విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు.

అలాగే 2027 లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో,  ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.

ముందుగా ఐదు గ్యారెంటీలతో జనాల్లోకి వెళ్లడంతో వాటిని నమ్మి ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారు.

సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.అయితే ఇప్పటి వరకు ఎన్నికలకు ముందు ఇచ్చిన కొన్ని హామీలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది.

మిగతా చాలా పథకాలు ఇంకా పెండింగ్ లోనే పెట్టారు.  ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడం,  ఆదాయ  వనరులు బాగా తగ్గిపోవడంతో ఎన్నికల హామీలను అమలు చేసే విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే మహిళలకు ఉచిత బస్సు(Free Bus) ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది.

  ఈ పథకం కోసం ఆర్టీసీకి దాదాపు 400 కోట్ల రూపాయలను ప్రతి నెలా చెల్లిస్తుంది.

"""/" / అలాగే విద్యుత్ బిల్లుల(Electricity Bills) చెల్లింపుల రాయితీలను ప్రకటించింది.  రెండు లక్షల రూపాయల రుణమాఫినీ కూడా చాలావరకు అమలు చేసింది.

ఇంకా పూర్తిస్థాయిలో అమలు చేయాల్సి ఉంటుంది.ఈ విషయంలోనే విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు కాంగ్రెస్ ఎదుర్కొంటుంది.

ఆ విమర్శల నుంచి తప్పించుకోవడంతో పాటు,  పూర్తిస్థాయిలో ప్రజల్లో మద్దతు పొందాలంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాల్సిందేనన్న పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారు.

"""/" / ఇది ఇలా ఉంటే ఈరోజు వరంగల్ పట్టణంలో ఇందిరా శక్తి పేరుతో మహిళల సభను నిర్వహిస్తున్నారు.

ఈ సభకు ముఖ్యఅతిథిగా రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు.ఈ సమావేశంలోనే మరో గ్యారంటీ అమలు చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

  మహాలక్ష్మి(Mahalakshmi) పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు నెలకు 2500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు.

రేషన్ కార్డులు(Ration Cards) మంజూరు చేయాల్సి ఉండడంతో,  ఈ పథకాన్ని ఇప్పటి వరకు వాయిదా వేస్తూ వచ్చారు.

అయితే ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ఈ పథకం అమలు తేదీని రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

మహిళల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..!