మీ కలలను ఏది ఆపలేదు.. ప్రతి ఒక్కరూ కలలు కనండి.. సమంత కామెంట్స్ వైరల్?
TeluguStop.com
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీల్ గా కొనసాగుతున్న వారందరూ రాత్రికి రాత్రి స్టార్ సెలబ్రిటీలు కాలేదు.
ఆ స్టార్ డమ్ వెనుక ఎంతో కష్టం దాగి ఉందని చెప్పాలి.ఈ క్రమంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న నటి సమంత కూడా ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను అనుభవించిందని తాజాగా ఆమె ఒక వీడియో ద్వారా తాను ఎదుర్కొన్న అనుభవించిన కష్టాల గురించి తెలియజేశారు.
ఈ క్రమంలోనే సమంత మాట్లాడుతూ తాను ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన సాధారణ ఆడపిల్లనని ఎన్నోసార్లు తెలిపారు.
అయితే తాను ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు టాపర్ గానే కొనసాగానని అయితే తనను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తన కలలు ఆశయాలను పక్కన పెట్టాల్సి వచ్చిందని సమంత పేర్కొన్నారు.
ఇక కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాను డబ్బు సంపాదించడం కోసం ఎన్నో పనులు చేశానని ఆ సమయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టానని ఈ సందర్భంగా సమంత తాను ఎదుర్కొన్న కష్టాలను గురించి తెలిపారు.
ఈ విధంగా ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత ఇప్పటివరకు వెనుతిరిగి చూసుకోలేదు.
"""/"/
ఇకపోతే గతంలో సమంత ఒక కార్యక్రమంలో భాగంగా పాల్గొని మీ కలలను ఏది ఆపలేదు.
అందుకే ప్రతి ఒక్కరూ కలలు కనీ ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ కలలను సహకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటూ ఈమె యువతను ప్రేరేపిస్తూ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇక సమంత సినిమాల విషయానికొస్తే ఈమె ప్రస్తుతం శాకుంతలం సినిమాలో నటించారు.ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
అదేవిధంగా యశోద అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో కూడా నటిస్తున్నారు.ఇకపోతే హీరో విజయ్ దేవరకొండ సరసన ఈమె ఖుషి సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.
కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?