ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు మీ భూ వివాదానికి సంబంధమేంటి?: పేర్ని నాని

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రభుత్వంపై విషం చిమ్మేలా మాజీ అధికారులను ఉసిగొల్పుతున్నారని తెలిపారు.మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ దిగజారి ప్రవర్తించారని పేర్ని నాని పేర్కొన్నారు.

పీవీ రమేశ్ తండ్రి సుబ్బారావు కొందరు రైతులతో కలిసి లీజుకు ఇచ్చారన్నారు.సరిహద్దులు లేని పీవీ రమేశ్ పొలం ఇప్పటికే వివాదంలో ఉందని తెలిపారు.

వినగడపలో జనవరిలో భూ వివాదంపై విచారణ చేశారని వెల్లడించారు.భూముల అసలు పత్రాలు తీసుకు రావాలని చెప్పినా పీవీ రమేశ్( PV Ramesh ) రాలేదన్నారు.

రైతులతో పీవీ రమేశ్ కు గొడవలుంటే ప్రభుత్వంపై బురదజల్లుతారా అని ప్రశ్నించారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు( Land Titling Act ) మీ భూ వివాదానికి సంబంధమేంటని ప్రశ్నించారు.

చంద్రబాబు కోసం ట్వీట్స్ చేయడం దేనికి సంకేతమో చెప్పాలని డిమాండ్ చేశారు.విన్నకోట గ్రామం రండి వాస్తవాలు ఏంటో తెలుసుకోండని తెలిపారు.

రామ్ చరణ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న నాగార్జున…