ఏపీలో పొత్తుల పై ప్రధాని మోది ఏమన్నారంటే ?

నువ్వా నేనా అన్నట్టుగా ఏపీలో రాజకీయ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది.

ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది.ఈనెల 13న పోలింగ్ జరగబోతోంది.

ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై బిజెపి అగ్రనేత ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా టిడిపి, జనసేన పార్టీలతో బిజెపి ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందనే అంశం పైన స్పందించారు.

అలాగే ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ పైన ప్రధాని స్పందించారు.వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుందనేది చెప్పారు.

ప్రస్తుతం ఏపీలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే భారీగా నిధులు అవసరమని, అది రాష్ట్రంలో వనరులపై ప్రభావం తీవ్రంగా చూపిస్తుంది అని మోది వ్యాఖ్యానించారు.

"""/" / ఓ కొత్త రాష్ట్రం అభివృద్ధికి హామీలు ఇవ్వాల్సి ఉంటుందని, కానీ కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఏపీలు కుమ్ములాడుకుంటున్నాయని, వాళ్ళు రూపొందించుకున్న విధానాలు అవినీతికి దారితీసాయని మోదీ విమర్శించారు.

ఏపీలో ఇసుక, మద్యం మాఫియా తెలంగాణలో భూ మాఫియా నడుస్తుందని, ప్రజల కోసం సరైన విధానాలు వారి వద్ద లేనప్పుడు ఇటువంటి పరిణామాలే చోటు చేసుకుంటాయని ప్రధాని విమర్శించారు.

ఏపీలో వైసిపి మళ్లీ గెలుస్తుందని తాను అనుకోవడంలేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఏపీలో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, ఆ ప్రభావం కిందిస్థాయి వరకు వెళ్లిందని అన్నారు.

"""/" / జగన్ ( CM Ys Jagan )ఎప్పుడూ తమ రాజకీయ మిత్రపక్షం కాదని, కేవలం పార్లమెంట్ లో సందర్భాన్ని భట్టి మద్దతు ఇచ్చారని అన్నారు.

గతంలోనూ జగన్ కు వ్యతిరేకంగా తాము ఎన్నికల్లో పోరాటం చేశామని, కానీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ప్రధానిగా తాను రాజ్యాంగం ప్రకారం పార్టీలు చూడకుండా పనిచేశామని అన్నారు.

దేశంలో ప్రతి రాష్ట్రానికి సాయం చేయాల్సిన బాధ్యత తమ పైన ఉందని, ఏపీకి అదే విధంగా సాయం అందించామని, ఎన్నికల వరకు వస్తే టీడీపీ, బీజేపీ ఎప్పటి నుంచో కలిసి పోటీ చేస్తున్నాయని, ఇప్పుడు తమతో జనసేన కూడా తోడైందని, ఈ మూడు పార్టీలు కలవడంతో ఈసారి జనం మద్దతు ఎన్డీఏకు ఉంటుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

నేడు ఏపీ ఈ -క్యాబినెట్ సమావేశం.. చర్చించే అంశాలు ఇవే