ధర్మరాజు అహంకారాన్ని దూరం చేసిన శ్రీకృష్ణుడు.. ఎలాగంటే?
TeluguStop.com
మన పురాణ ఇతిహాసాల విషయానికి వస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి.
ఈక్రమంలోనే మహాభారత ఇతిహాసాలలో ధర్మరాజు పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పంచ పాండవులలో పెద్దవారైన ధర్మరాజు కుంతీ యమధర్మరాజుల సంతానం.
పేరుకు తగ్గట్టుగానే ధర్మరాజు తన రాజ్యంలో ఎవరు ఏమి అడిగిన వారికి దానం చేస్తూ తన కన్నా ఈ ప్రపంచంలో దానం చేసే గొప్పవారు ఎవరూలేరని అహంకారంతో ఉండేవాడు.
అయితే ఎలాగైనా ధర్మరాజు అహంకారాన్ని దూరం చేయాలని శ్రీకృష్ణుడు భావించాడు.ఈ క్రమంలోనే ధర్మరాజును తీసుకొని శ్రీకృష్ణుడు ఒక రోజు వేరే రాజ్యానికి వెళ్లాడు.
ఆ రాజ్యాన్ని చక్రవర్తి మహాబాల ఎంతో అద్భుతంగా పరిపాలించేవాడు.ఆ రాజ్యంలో తన ప్రజలకు ఎలాంటి కష్టాలు లేకుండా ఎవరు కూడా ఇతరులపై ఆధారపడకుండా ప్రతి ఒక్కరికి పని కల్పిస్తూ తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించేవాడు.
ఈ రాజ్యానికి ధర్మ రాజును తీసుకు వెళ్లిన శ్రీకృష్ణుడు ఆ ఇంటిలోకి వెళ్లి తాగడానికి నీరు అని అడిగారు.
వెంటనే వారు బంగారు గ్లాసుతో నీటిని తీసుకువచ్చి ఇవ్వగా ధర్మరాజు నీటిని తాగి తిరిగి గ్లాస్ ఇస్తాడు.
అప్పుడు ఆ మహిళ ఆ బంగారు గ్లాసును వీధిలోకి పడేస్తుంది.అందుకు ధర్మరాజు అదేంటమ్మా అంత విలువైనది అలా పడేశారని అడగగా.
అందుకు ఆ మహిళ సమాధానం చెబుతూ మా రాజ్యంలో ఒకసారి ఉపయోగించిన వస్తువులు మరోసారి ఉపయోగించమని సమాధానం చెబుతుంది.
"""/" /
ఇక శ్రీకృష్ణుడు ధర్మరాజును చక్రవర్తి దగ్గరకు తీసుకెళ్లి మహా బలి చక్రవర్తికి ధర్మరాజును శ్రీ కృష్ణుడు ఎలా పరిచయం చేశాడు.
ఓరాజా ఇతడు ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎవరూ చేయని దానధర్మాలను చేసిన వ్యక్తి ఈయన పేరు ధర్మరాజు అని చెప్పగా మహాబల చక్రవర్తి ధర్మరాజు వంక చూడను కూడా చూడడు.
అందుకు చక్రవర్తి కృష్ణ మీరు చెప్పిన మాట నిజమే అయితే నా రాజ్యంలో ఇతని దానం పొందడానికి ఎవరూ సిద్ధంగా లేరు.
ఎందుకంటే నా రాజ్యంలోని ప్రజలు అందరూ ఎంతో సుభిక్షంగా ఏవిధమైనటువంటి కష్టం లేకుండా ఇతరులపై ఆధారపడి జీవించకుండా వారి కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నారు.
"""/" /
ఈయన రాజ్యంలో దానధర్మాలను అడుగుతున్నారంటే ఇతని రాజ్యంలో ఎంతటి పేదవారు ఉన్నారో అర్థమవుతుంది కానీ నా రాజ్యంలో ప్రతి ఒక్కరికి కష్టపడి పనిచేయడం ఇష్టం కానీ ఇతరులు పెట్టే భిక్ష కోసం ఎదురు చూడరు అంటూ తన రాజ్యం గురించి చెప్పగా ధర్మరాజు ఆ మాటలు విని సిగ్గుతో తల దించుకున్నారు.
ఏ విధమైనటువంటి శారీరక శ్రమ లేకుండా దాన ధర్మాలతో బతికేవాడు రోగితో సమానమని, తాను చేస్తున్నది పెద్ద తప్పు అని గ్రహించిన ధర్మరాజు తన అహంకారాన్ని వదులుకున్నారు.
లవర్ కోసం లొల్లి.. స్కూల్‌లోనే జుట్టు పట్టుకుని మరీ కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్!