కృతి శెట్టి కి కోపం వస్తే అలా చేస్తుందట..!

ఉప్పెన భామ కృతి శెట్టి ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయడంలో ముందుంటుంది.మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ భామ ఆ తర్వాత వచ్చిన మరో రెండు సినిమాలను అదే ఫలితాన్ని రిపీట్ చేసింది.

దానితో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగింది.కృతి శెట్టి సినిమాలో ఉంది అంటే సినిమా హిట్ అనే టాక్ కూడా వచ్చేసింది.

టాలీవుడ్ లక్కీ గాళ్ గా ప్రస్తుతం ఈ హీరోయిన్ సూపర్ ఫాం లో ఉంది.

త్వరలో రామ్ తో ది వారియర్ అని వస్తుంది కృతి శెట్టి.రామ్ తో కృతి శెట్టి జోడీ అదిరిపోయిందని చెప్పొచ్చు.

లింగుసామి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పవర్ ఫుల్ పోలీస్ కథతో వస్తుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది కృతి శెట్టి.అన్ని ఇంటర్వ్యూస్ లో భాగం అవుతూ తన మార్క్ చాటుకుంటుంది.

సినిమా ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి విషయాలు కూడా షేర్ చేసుకుంటుంది బేబమ్మ.

చిన్నప్పటి నుంచే మోడల్ గా చేస్తూ వచ్చిన కృతి శెట్టి తనకి ఇచ్చిన రెమ్యునరేషన్ గురించి ప్రస్థావించింది.

అంతేకాదు తనకు కోపం వస్తే ఏం చేస్తుందో అన్నది చెప్పి అందరిని ఆశ్చర్యపరచింది.

సాధారణంగా తనకు కోపం రాదని ఒకవేళ వస్తే మాత్రం ఎవరిని ఏమీ అనకుండా వెళ్లి తన రూమ్ లో బాగా పడుకుంటా అంటుంది కృతి శెట్టి.

"""/" / కోపం వస్తే అలిగి పడుకోవడం కామనే కానీ కృతి శెట్టి మాత్రం కోపం వస్తే డీప్ స్లీప్ లోకి వెళ్తుందట.

మరి అమ్మడికి ఇదేమి అలవాటో.రామ్ ది వారియర్ కూడా హిట్ పడితే కృతి శెట్టి క్రేజ్ ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉంది.

లింగుసామి ఈ సినిమాని పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.టీజర్ చూస్తేనే ఆ విషయం బాగా అర్ధమవుతుంది.

ఈ సినిమాలో కృతి శెట్టి గ్లామర్ కూడా ప్లస్ అయ్యేలా ఉంది.ఈ సినిమాతో పాటుగా నితిన్ మాచర్ల నియోజక వర్గం.

సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు చేస్తుంది కృతి శెట్టి.

ఈ సినిమాలతో అమ్మడు మరింత పాపులర్ అయ్యే అవకాశం ఉంది.

ఒక్క ఎపిసోడ్ కి 5 కోట్ల రెమ్యూనరేషన్.. కపిల్ శర్మ క్రేజ్ మామూలుగా లేదు?