వెండి నగలకు హాల్‌మార్కింగ్ వలన ఒరిగేదేమిటి? ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి!

భారతీయ మహిళలు నిత్యం వాడే బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ అనేది ఉండటం ఎంత అవసరమో అందరికీ ఓ ఐడియా వుంది.

అయితే వెండి ఆభరణాల విషయంలో హాల్‌మార్కింగ్ అనేది తప్పనిసరి కాదా? అనే ప్రశ్న చాలామందిలో మందిలో వున్న ప్రశ్న.

సంక్రాతి పండగ సీజన్‌ దగ్గరపడటంతో రాష్ట్రంలో బంగారం, వెండి అభరణాలు జోరుగా కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో వెండి అభరణాలకు హాల్‌మార్క్ ఎందుకు లేదనే ప్రశ్న చాలామందికి తలెత్తింది.

దానిగురించి ఇపుడు తెలుసుకుందాం.కేంద్రం వినియోగదారుల మేలుకోరి స్వచ్ఛమైన ఆభరణాల కోసం హాల్‌ మార్క్‌ తప్పనిసరి చేసింది.

ఈ నిబంధనలు జూన్ 1, 2022 నుండి అమల్లోకి వచ్చాయి.ఈ తేదీ తర్వాత ఏ నగల వ్యాపారి హాల్‌మార్క్ లేకుండా బంగారు ఆభరణాలను విక్రయించలేరు.

BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ప్రకారం నగల వ్యాపారి హాల్‌మార్క్ ఉన్న వెండి ఆభరణాలను మాత్రమే అమ్మడం ఒక్కటేకాదు, ఎవరైనా స్వర్ణకారుడు హాల్‌ మార్కింగ్‌తో వెండి అభరణాలు విక్రయించాలనుకుంటే కూడా విక్రయించుకోవచ్చు.

అయితే దీనికి ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా ఉండాలనే నిబంధన అయితే లేదు. """/"/ కస్టమర్ కోరుకుంటే అతను ఆభరణాల వ్యాపారి నుండి హాల్‌మార్కింగ్ కోరవచ్చు.

దీని కోసం స్వర్ణకారుడు హాల్‌మార్కింగ్ కోసం కొంత రూసుము వసూలు చేస్తారు.కస్టమర్‌కు హాల్‌ మార్కింగ్‌ కావాలనుకుంటే నగర వ్యాపారి అభరణాలను తయారు చేసి హాల్‌మార్క్‌ పరీక్షా కేంద్రానికి పంపుతాడు.

అప్పుడు హాల్‌మార్కింగ్ ఛార్జీని జోడించి ఆభరణాలు కస్టమర్‌కు అందజేస్తాడు.బంగారంపై హాల్‌మార్కింగ్ గుర్తు ఉన్నట్లే, వెండి ఆభరణాలకు కూడా హాల్‌మార్కింగ్ గుర్తు ఉంటుంది.

BIS గుర్తుతో ఆభరణాలపై సిల్వర్‌ అని అని రాయబడుతుంది.వెండి స్వచ్ఛత గ్రేడ్ లేదా ఫైన్‌నెస్ కూడా రాయబడుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్19, శనివారం 2024