సూపర్ సిక్స్ పథకాల అమలుపై చంద్రబాబు ఏమన్నారంటే ? 

78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu )ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు .

ఆ తరువాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా చంద్రబాబు స్వతంత్ర దినోత్సవ గొప్పతనాన్ని ప్రజలకు వివరించారు.

ఎందరో త్యాగంతో ఏర్పడిన స్వతంత్ర ఫలాలను నేడు మనమంతా అనుభవిస్తున్నామని తెలిపారు.గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను తిరిగి అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు అన్నారు.

సంక్షేమం,  అభివృద్ధి రెండు కళ్ళుగా పాలనకు శ్రీకారం చుట్టామని,  100 రోజుల ప్రణాళిక లక్ష్యంతో అన్ని శాఖలను సమీక్ష కు చేస్తున్నామని , గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన అన్ని వ్యవస్థలను పునరుద్ధరించే పనిలో ఉన్నామని చంద్రబాబు గత వైసిపి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి జరగకపోవడాన్ని ప్రస్తావించారు.

"""/" / అలాగే ఏపీ, తెలంగాణ విభజనతో అన్ని రకాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు గత ఐదేళ్లుగా రాజధాని లేకుండా అప్పటి పాలకులు చేశారని పరోక్షంగా వైసిపి పైన,  ఆ పార్టీ అధినేత జగన్( YS Jagan Mohan Reddy ) పైన విమర్శలు చేశారు.

అమరావతి , పోలవరం నిర్మాణంతో పాటు,  ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను  త్వరలోనే అమలు చేస్తామని చంద్రబాబు తెలిపారు.

120 కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని అన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గతంలో ప్రథమ స్థానంలో నిలిచామని చంద్రబాబు తెలిపారు.

గతంలో అధికారంలో ఉన్నప్పుడు 16 లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడుల ఒప్పందం చేసుకుని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచామని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు.

"""/" / టీడీపీ( TDP ) అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సూపర్ సిక్స్ పథకాల అమలు విషయంలో అనేక విమర్శలను ఎదుర్కొంటున్నారు ఎటు పరిస్థితుల్లోనూ ఆ పథకాలను అమలు చేయలేరని పదేపదే వైసిపి నేతలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టే విధంగా సూపర్ సిక్స్ పథకాల అమలు పై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.

అమెరికాలో భారతీయ జంట పెద్దమనసు .. స్కాలర్‌షిప్ ఫండ్ కోసం భారీ విరాళం