ప్రశ్న పత్రంలో దళితులు అంటే ఎవరు
TeluguStop.com
తమిళనాడులోని ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక పోటీ పరీక్షలో దళితులు అంటే ఎవరు అంటూ ఒక ప్రశ్నను ఇవ్వడం జరిగింది.
ఆ ప్రశ్నకు కింద సమాధానాలు కూడా ఇచ్చారు.నాలుగు సమాధానాలు ఏంటీ అంటే.
అంటరానివారు, సి.మిడిల్‌క్లాస్, డి.
ఉన్నతస్థాయి వారు అంటూ ఆప్షన్ ఇవ్వడం జరిగింది.ఈ ప్రశ్న ప్రస్తుతం తమిళనాట తీవ్ర దుమారంను రేపుతోంది.
ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండి పడుతూ చర్యలకు డిమాండ్ చేస్తున్నాడు.
తమిళులు అంటే అంటరాని వారు అంటూ ప్రశ్న పత్రంలో చేర్చడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
</br>
దళితులను కించపర్చే విధంగా ఈ ప్రశ్న ఉందని, కేంద్రీయ విశ్వవిద్యాలయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ విషయమై సీబీఎస్‌ఈ స్పందిస్తూ అది స్కూల్‌కు సంబంధించిన పాఠ్యాంశ పత్రం అని, దాన్ని తాము తయారు చేయడం లేదని, వాటిని స్థాని స్కూల్స్ మాత్రమే తయారు చేసుకుంటాయని, వాటితో తమకు ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు.
అయితే అలాంటి ప్రశ్నను ఇచ్చినందుకు గాను స్కూల్‌పై చర్యలు తీసుకుంటామని అన్నారు.ముఖ్యమంత్రి కూడా ఈ విషయమై విచారణకు ఆదేశించారు.
దళితులను అవమానించిన ఆ స్కూల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పడం జరిగింది.అయినా కూడా విషయం రచ్చ జరుగుతోంది.
How Modern Technology Shapes The IGaming Experience