వైరల్ న్యూస్.. ఏకంగా బెంగళూరు ఎయిర్ పోర్టు రన్వే పై ఆ యూట్యూబర్.. ఏం చేసాడంటే..!

తాజాగా బెంగళూరు నగర శివారు దేవనహళ్లి( Devanahalli, Bangalore ) అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌ వేపై ఓ వీడియో చిత్రీకరించి, దానిని యూట్యూబ్‌ లో అప్లోడ్‌ చేసిన యూట్యూబర్‌ వికాస్‌ గౌడను( Vikas Gowda ) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

ఇక తాను యూట్యూబ్‌ లో అప్లోడ్ చేసిన వీడియోలో.తాను టికెట్‌ లేకుండా రన్‌వే పైకి వచ్చాను.

, ఇక్కడే 24 గంటలు ఉన్నాను.అధికారులు, సిబ్బంది కళ్లుగప్పి రన్‌ వే పైకి వచ్చి ఈ వీడియో చేశాను’ అంటూ తాను ప్రకటించుకోవడం వైరల్‌గా మారింది.

"""/" / ఇక ఈ వీడియో చుసిన సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది( CISF Personnel ) ఫిర్యాదుతో.

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం( International Airport ) పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

యూట్యూబర్‌ వికాస్‌ గౌడ విమానంలో ప్రయాణించేందుకు ఓ టికెట్‌ కొనుగోలు చేసుకుని, రన్‌ వే వరకు వచ్చి అక్కడ ఓ వీడియో తీసుకుని, వెనక్కు వచ్చేశానని అతను పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.

అయితే 'అలా వెళ్లి.ఇలా రావడం.

' సాధ్యం కానీ విష్యం కాబట్టి.విషయాన్ని గుర్తించిన పోలీసులు అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

"""/" / ఇకపోతే ఎయిర్ పోర్టు అధికారులు, ఎయిర్ పోర్టు సిబ్బంది ( Airport Officials And Airport Staff )కళ్లు కప్పిన వికాస్ గౌడ దాదాపు 24 గంటలు అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే దగ్గరే ఉన్నాడని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

అతడు టిక్కెట్టు తీసుకోని విమానంలో ప్రయాణం చేయకుండా.ఎయిర్ పోర్టులోని రన్‌ వే పైనే ఉండిపోయాడని అధికారులు తెలిపారు.

దాదాపు 5 గంటల పాటు రన్ వే పరిసర ప్రాంతాల్లో ఉన్న వికాస్ గౌడ అక్కడ వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

వామ్మో.. రోజుకు ఒక కప్పు స్వీట్ కార్న్ తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా?