వెంకటేష్ హీరో గా మారడానికి రామానాయుడు ఏం చేశారంటే..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే అందరికీ ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఆ ఫీల్డ్ కి వెళ్తే లైఫ్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది అక్కడ సక్సెస్ అవుతమా లేదా అనేది తెలియక చాలా మంది టాలెంట్ ఉండి కూడా ఇండస్ట్రీ కి రావాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు.

అలా అనుకుంటూ ఉన్నవారే తర్వాత ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ ఫుల్ సినిమాలు తీసి మంచి హిట్లు కొడుతూ ఉంటారు అలాంటి వాళ్లలో ముందు వరుసలో ఉండేవాళ్ళు చాలా మందే ఇండస్ట్రీ లో ఉన్నారు.

ఇక ఇలా ఇండస్ట్రీ కి ఇంట్రెస్ట్ లేకుండా వచ్చి ఇక్కడ సూపర్ సక్సెస్ అయిన వాళ్లలో వెంకటేష్( Daggubati Venkatesh ) లాంటి హీరో మొదట వరుసలో ఉంటాడు.

"""/" / అప్పట్లో ఈయనకి సినిమాలు అంటే ఇష్టం లేకపోవడం తో ఈయన అమెరికా లో ఒక కంపెనీ పెట్టి దాన్ని చూసుకునే పనిలో బిజీ గా ఉన్నారట అయితే అదే టైం కి రామానాయుడు సురేష్ బాబు ని హీరో గా పరిచయం చేద్దాం అని అనుకున్నారట దానికి సురేష్ బాబు ఒప్పుకోలేదట నాకు సినిమాలు అంటే ఇష్టమే కానీ నేను సినిమాల్లో నటించలేను అని చెప్పాడట దాంతో రామానాయుడు( D Ramanaidu ) కూడా సరే అని సురేష్ బాబు( Suresh Babu ) ను హీరో గా చేయాలి అనే నిర్ణయాన్ని మార్చుకున్నాడట.

ఇక ఇలా సినిమాలు తీసే క్రమం లో రామానాయుడు ఒక మంచి కథ దొరికినప్పుడు ఎంత మంది హీరోల చుట్టూ తిరిగిన కూడా కొన్ని సార్లు హీరోలు డేట్స్ లేక ఇచ్చేవాళ్ళు కాదట దాంతో కోపానికి వచ్చిన రామానాయుడు.

"""/" / ఇక లాభం లేదు వీళ్ళ చుట్టూ తిరిగే కంటే మన ఇంట్లోనే హీరో ఉంటే మనకు నచ్చిన స్టోరీ ని ఆయనతోనే తీయచ్చు కదా అని వెంకటేష్ ని అమెరికా నుంచి ఇండియా కి రప్పించి ఆయనకి సినిమాల మీద ఇంట్రెస్ట్ వచ్చేలా చేసి అప్పుడు ఆయనకి యాక్టింగ్ నేర్పించి సినిమాల్లోకి తీసుకువచ్చాడు.

ఇంట్రెస్ట్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన కూడా ఇప్పుడు ఆయన విక్టరీ వెంకటేష్ గా పేరు తెచ్చుకున్నారు, ఇండస్ట్రీ లో ఒక స్టార్ హీరో గా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు.

పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చే కథల్లో ఇవీ ఉండకూడదా..?