ఆస్తుల గురించి వస్తున్న వార్తలపై స్పందించిన జగపతిబాబు ఏమన్నారంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోగా ఫ్యామిలీ హీరోగా ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలలో నటించి ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్నారు సీనియర్ నటుడు జగపతిబాబు.

ఈయన హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు.అనంతరం కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చినటువంటి జగపతిబాబు బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమా ద్వారా విలన్ పాత్రలో ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

ఇలా ఈయన విలన్ పాత్రలో ప్రేక్షకులను అద్భుతంగా మెప్పించడంతో ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది.

ఈ క్రమంలోనే ఈయనకు మరిన్ని సినిమాలలో విలన్ పాత్రలలో అవకాశాలు రావడం విశేషం.

ఇలా వరుస సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నటువంటి బాలకృష్ణ ఇదివరకే పలు ఇంటర్వ్యూలలో పాల్గొని తనకు హీరోగా కన్నా విలన్ గానే మంచి ఆదరణ అభిమానులు పెరిగారని, హీరోగా కంటే విలన్ గాని తాను ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నానని తెలిపారు.

ఇకపోతే జగపతిబాబు తండ్రి నిర్మాత కావడం విశేషం ఇలా ఒక ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈయన భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ వరుస సినిమాలలో నటించడంతో ఈయన ఆస్తిపాస్తుల గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి.

"""/"/ ఈ క్రమంలోనే ఈయన తన ఆస్తుల గురించి స్పందిస్తూ తాను పెద్దగా ఎలాంటి ఆస్తులను కూడా పెట్టలేదంటూ క్లారిటీ ఇచ్చారు.

అయినప్పటికీ తన ఆస్తులు గురించి వార్తలు రావడంతో తాజాగా తన ఆస్తుల గురించి వస్తున్న వార్తలపై ఈయన స్పందించి తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

ఈ క్రమంలోనే సాయిబాబాకు పూజ చేస్తున్నటువంటి ఒక వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

ఈ వీడియోని షేర్ చేసిన ఈయన అందరూ నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అంటున్నారు ఆ డబ్బులు నాకు ఇచ్చేయ్ స్వామి.

సమాధానం చెప్పలేక చస్తున్నా అంటూ ఈయన కామెంట్ చేశారు.ప్రస్తుతం ఈయన షేర్ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ వీడియో: పరోటాలలో ‘ వేప పరోటా ‘ వేరయా.. బ్రేక్ ఫాస్ట్ గా వేప పరోటా..