Faima : వామ్మో.. ఫైమా ఏంటి ఇంత పని చేసింది.. బాయ్ ఫ్రెండ్ ను వదిలి వేరే పెళ్లి?

జబర్దస్త్ ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అతి తక్కువ సమయంలోనే తన టాలెంట్ తో అందరిని ఫిదా చేసింది.

తన కామెడీ టైమింగ్ తో అందర్నీ ఆకట్టుకొని అభిమానులుగా మార్చుకుంది.ఫైమా( Faima ) చదువుకునే రోజుల్లో పటాస్ షోకు స్టూడెంట్ గా వచ్చి అక్కడ తన కామెడీతో అందరిని నవ్వించింది.

దీంతో యాంకర్ రవి తన టాలెంట్ ను తనకు పటాస్ షోలో అవకాశం ఇచ్చాడు.

పటాస్ షోలో చేసిన తర్వాత కొంతకాలానికి జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టింది.

ముక్కు అవినాష్, కెవ్వు కార్తీక్ లో టీంలో నటించే అవకాశం వచ్చింది.ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ టీం లో కూడా నటించింది.

ఇక జబర్దస్త్ లోనే ఉండగానే ఆమెకు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో అవకాశం వచ్చింది.

ఇక అక్కడ కూడా తన కామెడీ టైమింగ్ తో బాగా సందడి చేసింది.

"""/" / ఇక షో నుండి బయటకు వచ్చాక కూడా బాగా బిజీగా మారింది ఫైమా.

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా మారింది.గెటప్ మొత్తం మార్చేసింది.

అయితే ఇదంతా పక్కన పెడితే.ఫైమా మరో జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ ( Praveen )తో ప్రేమాయణం చేస్తున్న సంగతి తెలిసిందే.

బిగ్బాస్ సమయంలో వీరి మధ్య ఉన్న ప్రేమ రహస్యం బయటపడింది. """/" / ఇక అప్పటినుంచి ఇద్దరు కలిసి వీడియోలు తీయడం.

ఒకరి గురించి ఒకరు అన్నట్లుగా ఉండటం ఇలా అందరి దృష్టిలో పడ్డారు.ప్రవీణ్ కూడా జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు.

అయితే ఇదంతా పక్కన పెడితే ప్రవీణ్ ని వదిలేసి మరో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది.

ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ఇటీవలే తను తన ఇన్ స్టాలో ఒక ఫోటో పంచుకుంది.

అందులో తను మరో వ్యక్తిని పెళ్లి చేసుకునట్లు కనిపించింది.కానీ అది నిజం కాదు.

అదంతా బేబీ సినిమా( Baby Movie ) ఎఫెక్ట్ అని అర్థమైంది.బేబీ సినిమా చూసిన తర్వాత ఫైమా, ప్రవీణ్ బ్రేకప్ అయ్యారని సరదాగా ప్రచారం జరుగుతుంది.

కానీ ఇదంతా నిజం కాదు కేవలం బేబీ సినిమాకి స్పూఫ్ గా చేస్తున్న ఓ వీడియో అంటూ క్లారిటీ వచ్చేసింది.

ఈ క్రమంలో ప్రమోషన్ లో భాగంగానే ఫైమా ఆ పోస్ట్ షేర్ చేసింది.

అయితే పూలమాలతో ఫ్లెక్సీ లో చూడడంతో జనాలు ఆశ్చర్యపోయారు.అయితే ఆమధ్య ప్రవీణ్ కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు ఒక వీడియో వచ్చిన సంగతి తెలిసిందే.

కానీ అది కూడా ఒక యూట్యూబ్ వీడియో కోసం అని తర్వాత అర్థమైంది.

ఇక సెలబ్రెటీలకు ఇవన్నీ మామూలే అని చెప్పాలి.డబ్బు సంపాదించుకోవడం కోసం ఇటువంటి వీడియోస్ చేస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?