గతంలో కాంగ్రెస్ ఏం చేసింది..: మంత్రి కేటీఆర్

వేములవాడ నియోజకవర్గం చందుర్తిలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.కాంగ్రెస్, బీజేపీ వాళ్లు గంగిరెద్దుల్లా వస్తున్నారని తెలిపారు.

ఈ ఎన్నికలు మన తలరాతను మార్చే ఎన్నికలని మంత్రి కేటీఆర్ అన్నారు.గతంలో కాంగ్రెస్ ఏం చేసిందన్న కేటీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేసిందో ఆలోచించాలని చెప్పారు.

బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని తెలిపారు.కాంగ్రెస్ పాలనలో ప్రతి రోజూ జాగారం ఉండాల్సి వచ్చేదన్నారు.

నిత్యం మోటార్లు కాలిపోయేవని చెప్పారు.అంతేకాకుండా కాంగ్రెస్ నేతలు మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారని మండిపడ్డారు.

ఈ క్రమంలో మూడు గంటల కరెంట్ కావాలా? 24 గంటల కరెంట్ కావాలా అని ప్రశ్నించారు.

కల్కి సినిమా రివ్యూ: నాగ్ అశ్విన్ విజువల్ వండర్!