రామ్ చరణ్ కి చిరంజీవి చెప్పిన మాట ఏంటంటే..?

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ సహజమైన రీతిలో సక్సెస్ లను అందుకుంటూ ఇండియాలోనే వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా ఎదిగాడు.

ఇక ట్రిపుల్ ఆర్ సినిమాను చూసిన ప్రేక్షకులు తన నటనకి ఫిదా అయిపోయింది.

ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ చెంజర్( Game Changer ) అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తే రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కు హద్దులు ఉండవనేది స్పష్టంగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు విషయం ఏంటి అంటే రామ్ చరణ్ ఇంతలా సక్సెస్ అవ్వడానికి కారణం చిరంజీవి( Chiranjeevi ) చెప్పిన ఒక సీక్రెట్ అని మీకు తెలుసా.

? ఆ సీక్రెట్ ఏంటో మనం కూడా తెలుసుకుందాం రండి. """/" / రామ్ చరణ్ వరసగా మూస ధోరణిలో కమర్షియల్ సినిమాలు చేస్తూ వెళ్తున్న క్రమంలో ఇలాగే ఇంకో రెండు సంవత్సరాలు ఇలాంటి సినిమాలు చేసుకుంటూ వెళ్తే రామ్ చరణ్ కెరియర్ అనేది డౌన్ ఫాల్ అవుతుంది అని గమనించిన చిరంజీవి కొత్త రకమైన స్క్రిప్ట్ లని ఎంచుకోమని చెప్పడంతో రామ్ చరణ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కథలను విని అందులో ధృవ, రంగస్థలం( Dhruva, Rangasthalam ) లాంటి ఒక డిఫరెంట్ గా ఉండే సినిమాలను ట్రై చేశాడు.

"""/" / దాంతో అవి రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ లను అందుకోవడంతో ఇక కమర్షియల్ సినిమాలకి స్వస్తి చెప్పి డిఫరెంట్ జానర్ సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు.

అందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది.

ఇప్పుడు కూడా తను డిఫరెంట్ అటెంప్ట్ తో సినిమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడని రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పాడు.

ఇక తనని తాను మార్చుకున్న తీరు కూడా చాలా అద్భుతంగా అంటూ రామ్ చరణ్ ని చాలా మంది సినీ మేధావులు సైతం ప్రశంసిస్తూ ఉంటారు.

అందుకే రామ్ చరణ్ ఇంటర్నేషనల్ లెవల్ లో స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు.గ్లోబల్ స్టార్ గా పేరును కూడా సంపాదించుకున్నాడు.

కమిటీ కుర్రాళ్ళు సినిమా కి నేషనల్ అవార్డు వస్తుందా..?