బీజేపీ ఇదంతా దేనికోసం చేసిన‌ట్టు..? ఈ త్యాగం ఏదో అప్పుడే చేస్తే..

మహారాష్ట్ర రాజకీయాల్లో వ‌చ్చిన మ‌హా.తుఫాను అంతా ఇంతా కాదు.

అనేక నాట‌కీయ ప‌రిణామాల త‌ర్వాత మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చి శివ‌సేన రెబ‌ల్ నేత‌ ఏక్‌నాథ్ షిండే ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

బీజేపీ సీనియ‌ర్ నేత మాజీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫడ్న‌వీస్ డిప్యూటీగా బాధ్య‌తలు చేప‌ట్టారు.

శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు.

అయితే ఫ‌డ్న‌వీస్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వీ చేప‌డ‌తార‌ని, ఏక్ నాథ్ షిండే డిప్యూటీ బాధ్య‌తలు తీసుకుంటార‌ని అంతా అనుకున్నారు.

కానీ.ఎవ‌రూ ఊహించ‌ని విధంగా శివ‌సేన రెబ‌ల్ నేత‌ ఏక్‌నాథ్ షిండే సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తార‌ని ఫ‌డ్న‌వీస్ ప్ర‌క‌టించ‌డంతో అందరూ షాక్ అయ్యారు.

ముఖ్య‌మంత్రి అనుకున్న ఫ‌డ్న‌వీస్ డిప్యూటీ ప‌ద‌వీ చేప‌ట్టారు.దీంతో బీజేపీ వ్యూహం ఏంట‌న్న‌ది చ‌ర్చ‌గా మారింది.

అయితే ఈ ప‌రిణామాల‌పై తాజా మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే కాస్తా గట్టిగానే రియాక్ట్ అయ్యారు.

2019 ఎన్నికల ఫలితాలు త‌ర్వాత త‌మ ప్ర‌తిపాద‌న ఒప్పుకుంటే స‌రిపోయేది కదా.ఇప్పుడు మీరు చేసిందేంటీ.

? అని సూటిగానే ప్ర‌శ్నించాడు.చెరో సగం పదవీకాలం అని తాము పెట్టిన ప్రతిపాదనను నాడు అమిత్ షా ఎందుకు ఒప్పుకోలేదని అన్నారు.

మీ వల్లనే కదా మహా వికాస్ అఘాడీ ఏర్ప‌డింద‌ని ప్ర‌శ్నించారు.మరి ఇదే ప‌ని అప్పుడే చేసి ఉంటే ఉద్ధవ్ సీఎం అయ్యేవారు కదా.

ఎన్సీపీ కానీ కాంగ్రెస్ కానీ మ‌ధ్య‌లోకి వ‌చ్చేవి కావు క‌దా అని అంటున్నారు.

అప్పుడే ఆ ప్ర‌తిపాద‌న‌కు ఓకే చేసి ఉంటే అంతా స‌వ్యంగా ఉండేద‌ని.అయినా ఇప్పుడు ఇంత చేసి ఎం ద‌క్కింద‌ని అంటున్నారు.

"""/" / అయితే ప్ర‌స్తుత అసెంబ్లీ కూడా మ‌రో రెండేళ్ల‌లో ముగియ‌నుంది.ఈ నేప‌థ్యంలోనే శివ‌సేన‌ను చీల్చి ప్ర‌భుత్వాన్ని చేప‌డితే అప‌వాదు త‌ప్పా వ‌చ్చేది ఏమిలేద‌నే సీఎం పీఠానికి బీజేపీ దూరంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అందుకే తిరుగుబాటు దారుల‌కే బాధ్య‌త‌లు అప్ప‌గించి బీజేపీకి ఈ ప‌రిణామాల‌తో సంబంధం లేద‌నే కాన్సెప్ట్ తో ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

అయిన‌ప్ప‌టికీ సర్కార్లను కూలదోయడం బీజేపీ భేష్ అన్న చెడ్డ పేరు వినిపిస్తోంది.

లిక్కర్ పాలసీ ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై తీర్పు రిజర్వ్